ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ స్పీచ్ గురించి తెలిసిందే. సినిమా వేడుకలలో ఆయన ఇచ్చే స్పీచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూసే అభిమానులు ఎందరో ఉన్నారు.. బండ్ల గణేష్ మాట్లాడుతున్నంత సమయం విజిల్స్, అరుపులతో స్జేజ్ మొత్తం దద్దరిల్లిపోతుంది. తాజాగా మరోసారి చోర్ బజార్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు బండ్ల గణేష్.. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం చోర్ బజార్.. డైరెక్టర్ జీవన్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో గెహనా సిప్పీ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈనెల 24న విడుదల కానుంది. ఈ క్రమంలో బుధవారం (జూన్ 22న) హైదరాబాద్ లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన బండ్ల గణేష్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
బండ్ల గణేష్ మాట్లాడుతూ.. “దేశం మొత్తం కల్లాపు చల్లాడు కానీ.. ఇంటి ముందు కల్లాపు చల్లడానికి టైం లేద ఆయనకు.. ఎంతో మందిని స్టార్లను చేశాడు.. డైలాగ్స్ చెప్పడం రాని వాళ్లకు నేర్పాడు.. డాన్సులు రాని వాళ్ళకు డాన్సులు నేర్పాడు.. కానీ కన్న కొడుకు సినిమా ఫంక్షన్ కు రాలేకపోయాడు.. నా పిల్లల కోసం నేనెక్కడున్న ఫ్లైట్ వేసుకుని వచ్చేవాడిని.. మనం ఏం చేసిన పిల్లల కోసం.. మనం చస్తే తలకొరివి పెట్టాల్సింది వాళ్లే.. మనం సంపాదించిన ఆస్తులు వాళ్లకే.. మనం అప్పులు చేస్తే తీర్చేదీ వాళ్లే.. ఆకాష్ అంటే సన్నాఫ్ పూరీ జగన్నాథ్, ఇంకొకడి పేరు రాస్తా అంటే రాజ్యంగం ఊరుకోదు.. చోర్ బజార్ నీ కొడుకు చింపేశాడు.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. నువ్వు చేయకపోయిన నీ కొడుకు స్టార్ అవుతాడు.. నువ్వు కూడా నీ కొడుకు డేట్స్ కోసం క్యూలో ఉండే రోజు వస్తుంది. అలాంటి రోజు రాకపోతే నా పేరు బండ్ల గణేష్ కాదు. ఆరోజు వచ్చినప్పుడు రేపు నీ కొడుకు స్టార్ అయ్యాక నీకు డేట్స్ ఇవ్వొద్దు అని చెబుతాను.. ఈ సినిమాను ఆదరించండి.. పూరి వలన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరోలు వచ్చి ఆకాష్ పూరిని ఎంకరేజ్ చేస్తారనున్నాను.. కానీ ఎవరు రాలేదు.. సినిమా కదా.. అంతే వాళ్లు బిజీ.. ఆకాష్ పూరి బ్లాక్ బస్టర్ సూపర్ స్టార్ అవుతాడు. స్టార్ అయి తీరతాడు.. చోర్ బజార్ సినిమా సూపర్ హిట్ అవుతుంది ” అంటూ చెప్పుకొచ్చారు..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.