
దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వీధుల్లో కొలువైన గణపతి విగ్రహాలు భక్తులతో పూజలందుకుంటున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ గణేష్ చతుర్థి వేడుకల్లో భాగమవుతున్నారు. ఈ క్రమంలో లెజెండరీ నటుడు, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఇందులో ఆయన తమ స్వగృహంలో మట్టి వినాయకుడిని తయారు చేస్తూ కనిపించారు. తద్వారా పర్యావరణానికి హానీ కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీ గణేశాను పూజించాలని సందేశం ఇచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే ఈ ఫొటోస్ ఇప్పటివి కావని తెలుస్తోంది. కరోనా టైమ్ లో తీసిన ఫొటోలని తెలుస్తోంది. అప్పుడు వినాయక చవితికి గణపతి విగ్రహాల ప్రతిష్టించడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వలేదు. దీనితో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు
ఎవరు ఇంట్లో వాళ్లే మట్టి గణపయ్యని తయారుచేసుకున్నారు. ఇంట్లోనే ప్రతిష్టించుకొని పూజలు చేసుకున్నారు. అలా బ్రహ్మానందం కూడా ఇంట్లోనే మట్టి గణపతిని తయారుచేసి పూజలు నిర్వహించారు. అప్పటి ఫొటోలను మళ్లీ ఒక నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్తా ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. చాలా మంది సినీ అభిమానులు, నెటిజన్లు ఈ ఫొటోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ‘బ్రహ్మీ ది క్రియేటర్’ అంటూ తెగ పొగిడేస్తున్నారు. బ్రహ్మీ లానే అందరూ మట్టి గణపతులనే పూజించాలంటూ నెట్టింట ప్రచారం చేస్తున్నారు.
బ్రహ్మానందం వివిధ భాషలలో కలిపి సుమారు 1250కి పైగా సినిమాలలో నటించారు. తన అభినయ ప్రతిభతో గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కాడు. అలాగే పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నాడు. అలాగే ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం, ఆరు సినీ మా అవార్డులు, మూడు సైమా పురస్కారాలు అందుకున్నారు. అయితే గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించేశారీ లెజెండరీ యాక్టర్.
#Brahmanandam garu making Ganapathi Idol #HappyGaneshChaturthi pic.twitter.com/lgfxkdbk0b
— Sreedhar Sri (@SreedharSri4u) August 26, 2025
ఈ ఏడాది నాలుగు సినిమాల్లో కనిపించారు బ్రహ్మానందం. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, కుమారుడు గౌతమ్ తో కలిసి బ్రహ్మ ఆనందం, నేనేక్కడున్నా, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాల్లో కనిపించారు బ్రహ్మీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి