Actor Brahmaji: ఇక ట్రోలింగ్స్ చాలు.. మీ పని మీరు చేసుకోండి.. నటుడు బ్రహ్మాజీ ట్వీట్..

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వెంకటేశ్, నితిన్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిర్మాత నాగవంశీ, డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇలా ఇండస్ట్రీలోని స్టార్స్ అందరూ పవన్ ను విష్ చేశారు. తాజాగా టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ సైతం పవర్ కళ్యాణ్ కు విషెస్ చెబుతూ ఓ టి్వీట్ చేశారు. అలాగే సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా పవన్ ఫ్యాన్స్ షేర్ చేసే ట్రోల్స్ వీడియోలకు కూడా రీట్వీట్ చేశారు.

Actor Brahmaji: ఇక ట్రోలింగ్స్ చాలు.. మీ పని మీరు చేసుకోండి.. నటుడు బ్రహ్మాజీ ట్వీట్..
Actor Brahmaji
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 06, 2024 | 4:54 PM

ఆంధ్రప్రదేశ్‏లో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ గెలవడంతో సినీ పరిశ్రమకు చెందిన స్టార్స్, నటీనటులు, అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోకు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. దాదాపు పదేళ్లుగా జనసేన అధినేతగా పవన్ జర్నీ వీడియోలను షేర్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వెంకటేశ్, నితిన్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిర్మాత నాగవంశీ, డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇలా ఇండస్ట్రీలోని స్టార్స్ అందరూ పవన్ ను విష్ చేశారు. తాజాగా టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ సైతం పవర్ కళ్యాణ్ కు విషెస్ చెబుతూ ఓ టి్వీట్ చేశారు. అలాగే సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా పవన్ ఫ్యాన్స్ షేర్ చేసే ట్రోల్స్ వీడియోలకు కూడా రీట్వీట్ చేశారు.

“ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాను. మీరు కూడా మీ పని చూసుకుంటే మంచిది. ఉత్సాహం, వినోదం రెండూ అయిపోయాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్ లో ఉంది. ఇక మీరు మీ భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. ట్రోలింగ్ చేయడంలో ఎలాంటి అర్థం లేదు. మన భవిష్యత్తు కోసం మనమే పనిచేద్ధాం. వాళ్లు తప్పు చేస్తే.. మళ్లీ మీరు అదే తప్పు చేయకూడదు కదా..?” అంటూ ట్వీట్ చేశారు. ఇక బ్రహ్మాజీ పోస్టుకు మద్దతు తెలుపుతున్నారు నెటిజన్స్. కానీ కొందరు మాత్రం బ్రహ్మాజీ పై ఫైర్ అవుతున్నారు.

నటుడు బ్రహ్మాజీ మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన వ్యక్తి. ఇప్పటివరకు మెగా హీరోలందరి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. సినిమాల్లోనే కాకుండా బయట కూడా మెగా ఫ్యామిలీతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. ఈ క్రమంలో ఇటీవల పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలవడంతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.