Bellamkonda Srinivas: రష్మికతో ప్రేమాయణంపై స్పందించిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరో..

|

May 03, 2023 | 1:30 PM

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ మే 12న విడుదల కానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ షూరు చేశారు చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఇటీవల ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఈ హీరో.. రష్మికతో ప్రేమాయణంపై స్పందించినట్లుగా తెలుస్తోంది. తామిద్దరం మంచి స్నేహితులమని.. తమ గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని అన్నారు.

Bellamkonda Srinivas: రష్మికతో ప్రేమాయణంపై స్పందించిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరో..
Bellamkonda Sreenivas
Follow us on

తొలి సినిమాతోనే హిట్ అందుకుని హీరోగా క్రేజ్ సంపాదించుకున్నవారిలో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరు. అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన శ్రీనివాస్.. ప్రస్తుతం హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చత్రపతి సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ మే 12న విడుదల కానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ షూరు చేశారు చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఇటీవల ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఈ హీరో.. రష్మికతో ప్రేమాయణంపై స్పందించినట్లుగా తెలుస్తోంది. తామిద్దరం మంచి స్నేహితులమని.. తమ గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని అన్నారు.

ఛత్రపతి సినిమా చిత్రీకరణలో భాగంగా చాలా రోజులుగా శ్రీనివాస్ ముంబై వెళ్లి వస్తున్నారు. అలాగే రష్మిక సైతం యానిమల్, గుడ్ బై సినిమాల షూటింగ్స్ కోసం ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరు కలిసి చాలాసార్లు ఎయిర్ పోర్టులో మీడియా కంటికి చిక్కారు. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది. అంతేకాకుండా.. రష్మిక విజయ్ దేవరకొండకు బ్రేకప్ చెప్పేసిందని.. ఇప్పుడు ఆమె బెల్లంకొండ అబ్బాయితో ప్రేమలో ఉందంటూ వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై రష్మిక, శ్రీనివాస్ స్పందించలేదు. తాజాగ చత్రపతి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మికతో ప్రేమాయణంపై గురించి స్పందించారు.

ఇవి కూడా చదవండి

“మేమిద్దరం కలుసుకోవడమే గగనమైపోయింది. అలాంటిది మీరు ఏకంగా డేటింగ్ అనేస్తున్నారేంటీ.. మేము ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. మేము మంచి స్నేహితులము మాత్రమే. సినిమాల కోసమే హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాల్సి వస్తుంది. అయినా కలిసి ప్రయాణించలేదు. కేవలం ఎయిర్ పోర్టులో మాత్రమే తారసపడ్డాం. అందులో భాగంగానే మీడియాకు ఒకటి రెండు సార్లు కనిపించాము ” అంటూ చెప్పుకొచ్చారు.