Balakrishna: సింహం వేటకు సిద్ధమైంది.. బాలయ్య సినిమా నుంచి మరో అప్డేట్.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

|

Jun 07, 2022 | 10:41 AM

బాలయ్య, గోపిచంద్ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. బాలయ్య ఫస్ట్ హంట్ లోడింగ్ అని తెలియజేస్తూ.

Balakrishna: సింహం వేటకు సిద్ధమైంది.. బాలయ్య సినిమా నుంచి మరో అప్డేట్.. ఆకట్టుకుంటున్న పోస్టర్..
Balakrishna
Follow us on

ఇటీవల అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా తర్వాత బాలయ్య తన సినిమాల విషయంలో జోరు పెంచాడు.. ప్రస్తుతం బాలయ్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి రోజుకో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో బాలయ్య సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. అయితే బాలయ్య పుట్టినరోజు కానుకగా ఈ మూవీ నుంచి మాసివ్ అప్డేట్ రాబోతుందని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ ఇంట్రెస్టింగ్ అప్డేట్ రివీల్ చేశారు మేకర్స్.

బాలయ్య, గోపిచంద్ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. బాలయ్య ఫస్ట్ హంట్ లోడింగ్ అని తెలియజేస్తూ.. రెండు చేతుల పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు అన్నగారు, జై బాలయ్య అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ రెండింటిలో ఒక టైటిల్ కన్ఫా్ర్మ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు,

ఇవి కూడా చదవండి

ట్వీట్..