Puri Balakrishna: మరోసారి రిపీట్‌ కానున్న క్రేజీ కాంబినేషన్‌.. బాలయ్య మళ్లీ పైసా వసూల్ చేస్తారా.?

Puri Balakrishna: నట సింహం బాలకృష్ణ సినిమా కెరీర్‌లో 'పైసా వసూల్‌' చిత్రానికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాతో తనలోని మరో కొత్త కోణాన్ని చూపించారు బాలయ్య. పూరి జగన్నాథ్‌ మార్క్‌...

Puri Balakrishna: మరోసారి రిపీట్‌ కానున్న క్రేజీ కాంబినేషన్‌.. బాలయ్య మళ్లీ పైసా వసూల్ చేస్తారా.?
Paisa Vasool Combination

Edited By: Subhash Goud

Updated on: Jul 22, 2021 | 9:12 AM

Puri Balakrishna: నట సింహం బాలకృష్ణ సినిమా కెరీర్‌లో ‘పైసా వసూల్‌’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాతో తనలోని మరో కొత్త కోణాన్ని చూపించారు బాలయ్య. పూరి జగన్నాథ్‌ మార్క్‌ దర్శకత్వం, బాలకృష్ణ సరికొత్త మేనరిజంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌ రిపీట్‌ కానుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ విషయాన్ని బాలకృష్ణ తాజాగా తానే స్వయంగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ మాట్లాడుతూ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు.

మాస్‌ ఎలిమెంట్స్‌తో కూడిన పూరి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే సినిమాకు ఓకే చెప్పానని బాలయ్య తెలిపారు. ఇదిలా ఉంటే ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ తర్వాత సినిమాల్లో కాస్త వేగాన్ని తగ్గించిన బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలకు ఓకే చెబుతూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు. ప్రస్తుతం ‘అఖండ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు బాలయ్య. ఈ సినిమా చివర షెడ్యూల్‌ తాజాగా ప్రారంభమైంది. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ వెంటనే గోపీచంద్‌ మలినేనితో ఓ సినిమా చేయనున్నారు. ఇది కూడా యాక్షన్‌ సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమా పూర్తి కాగానే పూరి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో సందడి చేసేందుకు బాలకృష్ణ సిద్ధమవుతున్నారన్నమాట.

Also Read: Taapsee Pannu: మిషన్ ఇంపాజిబుల్ కోసం తాప్సీ నయా గెటప్.. కీలక పాత్రలో పంజాబీ బ్యూటీ..

Anasuya: వర్షంపై కవిత్వాన్ని షేర్ చేసిన అనసూయ.. ఆ అందమైన కవిత్వం ఎవరు రాసిందో తెలుసా..

షూటింగ్ సమయంలో చిరంజీవి నాపై అరిచాడు.. అసలు కారణం అదే.. ఆసక్తికర విషయాలను చెప్పిన అన్నపూర్ణ..