AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anish Kuruvilla : ఆ డైరెక్టర్ ఒక మేజిషన్.. అలాంటి సినిమా ఎవరూ తీయలేరు.. టాలీవుడ్ నటుడు..

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు అనీష్ కురువిల్లా. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ సుపరిచితమే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ఓ స్టార్ డైరెక్టర్ తనకు లైఫ్ ఇచ్చారని చెప్పుకొచ్చారు.

Anish Kuruvilla : ఆ డైరెక్టర్ ఒక మేజిషన్.. అలాంటి సినిమా ఎవరూ తీయలేరు.. టాలీవుడ్ నటుడు..
Anish Kuruvilla
Rajitha Chanti
|

Updated on: May 16, 2026 | 10:52 AM

Share

నటుడు అనీష్ కురువిల్లా ఇటీవలి ఇంటర్వ్యూలో దర్శకుడు శేఖర్ కమ్ముల, డాలర్ డ్రీమ్స్ సినిమాతో తన సుదీర్ఘ ప్రయాణాన్ని, అందుకు సంబంధించిన అనుభవాలను వివరించారు. 1997లో భారత స్వాతంత్ర్య దినోత్సవ స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రొడ్యూసర్-డైరెక్టర్ మణి శంకర్ రూపొందించిన మ్యూజిక్ వీడియోలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ ప్రస్థానాన్ని అనీష్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌లో బాబా సెహగల్, కమల్ హాసన్, కార్తీక్ రాజా వంటి దిగ్గజాలతో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభూతి అని ఆయన గుర్తుచేసుకున్నారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా స్టార్లను ఎయిర్‌పోర్ట్ నుండి పికప్ చేయడం వంటి అనేక బాధ్యతలను నిర్వర్తించానని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి, అలాగే వారి కాంబినేషన్‌లో వచ్చిన క్లాసిక్ హిట్ ‘ఆనంద్’ సినిమా గురించి చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. తనతో చాలా సినిమాలు చేశా.. నయనతార కామెంట్స్..

శేఖర్ కమ్ముల తన ఫిలిం స్కూల్ గ్రాడ్యుయేషన్ థీసిస్ కోసం రాసుకున్న కథే ‘ఆనంద్’. ‘డాలర్ డ్రీమ్స్’ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చినప్పటికీ, ‘ఆనంద్’ లాంటి పెద్ద సబ్జెక్ట్‌ను తెలుగులో నిర్మించడానికి నిర్మాతలు ముందుకు రాలేదు. ఆ సమయంలో తామిద్దరూ సికింద్రాబాద్ (పద్మారావు నగర్, తార్నాక పరిసరాల్లో) పెరిగిన వాతావరణం, అక్కడి మధ్యతరగతి జీవనశైలి, మానవ సంబంధాలను స్క్రీన్‌పై చూపించాలని బలంగా ఫిక్స్ అయ్యారు. అప్పటివరకు తెలుగు సినిమాలో చూడని ఒక సరికొత్త ఎమోషనల్ ఫ్లేవర్‌ను శేఖర్ ఈ కథ ద్వారా ఆవిష్కరించారని అనీష్ చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆట సినిమాలో ఇలియనానను పెట్టుకున్నానని ఆ హీరోయిన్ అలిగింది.. నిర్మాత ఎం ఎస్ రాజు..

ఈ సినిమాకు విజయ్ కుమార్ (డీఓపీ) గారితో కలిసి ఒక ఇన్నోవేటివ్ హౌస్ సెట్ వేయడం కెరీర్‌లోనే పెద్ద నిర్ణయమన్నారు. ఆ సెట్ లోపలే బ్లాక్ క్లాత్స్ కవర్ చేసి సమ్మర్ మార్నింగ్స్, వింటర్ ఈవెనింగ్స్ లాంటి ప్రతి సీజన్‌ను అద్భుతంగా సృష్టించారని, ఇప్పటికీ ఆ ఇంటి మెట్ల మీద ఆనంద్, రూప కూర్చుని మాట్లాడుకునే ఫ్రేమ్స్ తనకు గుర్తున్నాయని అనీష్ గుర్తుచేసుకున్నారు. ‘ఆనంద్’ సినిమా రఫ్ కట్ చూసినప్పుడు ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ కథానాయకి ‘రూప’ క్యారెక్టరైజేషన్, ఆమె ప్రవర్తన చాలా వింతగా, కొత్తగా ఉందని చర్చించినట్లు అనీష్ తెలిపారు. ఈ సినిమా సరికొత్త పేసింగ్‌తో సాగిందని చెప్పారు.అహం (ego) లేకుండా, ఆడ-మగ అనే తేడా లేకుండా ఇద్దరినీ సమానంగా చూపే ఒక గొప్ప ‘వాల్యూ సిస్టమ్’ను శేఖర్ కమ్ముల తన రచన ద్వారా తెలుగు సినిమాకు పరిచయం చేశారని, అందుకే ఆడియన్స్ ఆ చిత్రానికి అంతగా కనెక్ట్ అయ్యారని అనీష్ కురువిల్లా ప్రశంసల జల్లు కురిపించారు.

ఎక్కువ మంది చదివినవి : Ananya Nagalla : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అలాంటి భర్త రావాలి.. హీరోయిన్ అనన్య నాగళ్ల..

Anish Kuruvilla, Shekar Kam

Anish Kuruvilla, Shekar Kam

ఎక్కువ మంది చదివినవి :  Chiranjeevi- Rajinikanth: రజినీకాంత్ హీరో.. చిరంజీవి విలన్.. కట్ చేస్తే.. అక్కడ బ్లాక్ బస్టర్..

Follow Us