Allu Sirish: ‘అయ్యో ఏమైంది బ్రో.. ప్రేమలో వెనుకడుగు వేయకూడదు’… అభిమానిని ఓదార్చిన అల్లు శిరీష్‌.

Allu Sirish: సంతోషం అయినా బాధ అయినా సినిమాలకు లింక్‌ చేసుకోవడం చాలా మందికి అలవాటు. సినిమాలను ఎంతగానో ఇష్టపడే ప్రేక్షకులు వాటిని జీవితంలో ఒక భాగంగా...

Allu Sirish: అయ్యో ఏమైంది బ్రో.. ప్రేమలో వెనుకడుగు వేయకూడదు... అభిమానిని ఓదార్చిన అల్లు శిరీష్‌.
Allu Sirish Post

Updated on: Aug 15, 2021 | 12:29 PM

Allu Sirish: సంతోషం అయినా బాధ అయినా సినిమాలకు లింక్‌ చేసుకోవడం చాలా మందికి అలవాటు. సినిమాలను ఎంతగానో ఇష్టపడే ప్రేక్షకులు వాటిని జీవితంలో ఒక భాగంగా కూడా భావిస్తుంటారు. తమ జీవితంలో జరిగే సంఘటనలను సినిమాలతో పోల్చుకుంటారు. మీరు కూడా ఏదో ఒక సమయంలో ఇలాంటి ఫీలింగ్‌ను అనుభవించే ఉంటారు కదూ. తాజాగా ఓ సినీ లవర్‌ చేసిన పని పట్ల ఏకంగా హీరో అల్లు శిరీష్‌ స్పందించారు. ఇంతకీ విషయమేంటంటే.. అల్లు శిరీష్‌ నటించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలో లవ్‌ ఫెయిల్యుర్‌కు సంబంధించి ఓ డైలాగ్‌ ఉంటుంది. ప్రేమించిన ప్రేయసి దూరమవుతోన్న సమయంలో హీరో.. ‘ఎవర్నీ ఎక్కువగా ప్రేమించకూడదు.. అలా చేస్తే ఓ బ్యాగేజ్ మనం మోస్తున్నట్లే.. మనల్ని మనం చంపుకునేలా చేస్తుంది ఈ ప్రేమ’ అనే డైలాగ్‌ బాగా అప్పట్లో యూత్‌ను బాగా ఆకట్టుకుంది.

అయితే ఈ డైలాగ్‌ను వ్యక్తిగతంగా తీసుకున్న ఓ నెటిజన్‌ తన జీవితానికి లింక్‌ చేసుకుంటూ.. వీడియోను పోస్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా.. ‘నేను కూడా ప్రస్తుతం ఇలాంటి ఫీలింగ్‌లోనే ఉన్నాను’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్‌ కాస్త శిరీష్‌ దృష్టిలో పడింది. దీంతో అభిమానిని ఓదార్చడానికి ప్రయత్నించిన శిరీష్‌.. ‘అయ్యే.. ఏమైంది బ్రో. అది కేవలం సినిమా డైలాగ్‌ మాత్రమే. ప్రేమలో వెనుకడుగు వేయకూడదు. అంతా మంచే జరుగుతుంది’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ సంభాషణ వైరల్‌గా మారింది.

Also Read: Chiranjeevi : మీ పోరాటాలకు,త్యాగాలకు ఎప్పుడూ రుణపడి ఉంటాం.. మెగాస్టార్ ఎమోషన్ ట్వీట్

Partition On Film Screen: భారతీయ హృదయాలను తాకిన విభజనపై వచ్చిన ఐదు సినిమాలు.. అలనాటి మరుపురాని చిత్రాలు..

MAA Elections 2021: నటి హేమకు ఊరట.. హెచ్చరించి వదిలేసిన క్రమశిక్షణ కమిటీ.. మరోసారి రిపీట్ అయితే..