Tollywood: అట్లతద్ది పూజలో స్టార్ హీరో సతీమణి.. ఎర్ర పట్టుచీరలో మెరిసిన బుట్టబొమ్మ.. ఎవరో గుర్తుపట్టారా..?

అట్లతద్ది.. తెలుగు రాష్ట్రాల్లోని పెళ్లికాని అమ్మాయిలు.. పెళ్లైన స్త్రీలు ఘనంగా జరుపుకునే పండగ. తెలుగు సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం అశ్విని మాసంలో కృష్ణపక్షంలో వచ్చే తదియ, చతుర్థి నాడు ఈ పండగను జరుపుకుంటారు. తమకు మంచి భర్త రావాలని పెళ్లికాని అమ్మాయి.. తమ భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని పెళ్లైన స్త్రీలు దేవుడిని ప్రార్థిస్తూ ఈ పండగను జరుపుకుంటారు.

Tollywood: అట్లతద్ది పూజలో స్టార్ హీరో సతీమణి.. ఎర్ర పట్టుచీరలో మెరిసిన బుట్టబొమ్మ.. ఎవరో గుర్తుపట్టారా..?
Actor
Follow us

|

Updated on: Oct 20, 2024 | 1:14 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు స్టార్ హీరోహీరోయిన్స్ ఆచారాలు, సంప్రదాయాలను మర్చిపోకుండా పాటిస్తుంటారు. ఎంత పెద్ద సెలబ్రెటీస్ అయినా ట్రెడిషనల్ ఫెస్టివల్స్ ఎంతో అట్టహాసంగా జరుపుకుంటారు. ఈరోజు అట్లతద్ది. సంక్రాంతి, ఉగాది, బతుకమ్మ, వరలక్ష్మి వ్రతం పండగలలాగే అట్లతద్దిని కూడా మహిళలు, అమ్మాయిలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తెలుగు సంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది అశ్విని మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే తదియ, చతుర్థినాడు ఈ అట్లతద్దిని జరుపుకుంటారు. ఉత్తరాదిలో దీనినే కర్వా చౌత్ అంటారు. పెళ్లికానీ అమ్మాయిలు తమకు మంచి భర్త రావాలని దేవుడికి పూజ చేస్తారు. ఇక పెళ్లైన మహిళలు తమ భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తుంటారు. ఈరోజు అట్లతద్ది, కర్వా చౌత్ కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న స్త్రీలు సంప్రదాయ దుస్తులు ధరించి దేవుడికి పూజ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ స్టార్స్ కూడా ఈ పండగను జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. తాజాగా తెలుగు స్టార్ హీరో సతీమణి కూడా అట్లతద్ది పండగను ఘనంగా సెలబ్రెట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టిటం పంచుకోగా క్షణాల్లో వైరల్ అయ్యాయి.

పైన ఫోటోలో ఎర్రరంగు పట్టుచీరలో అందంగా ముస్తాబై మిర్రర్ ముందు సెల్ఫీ తీసుకుంటున్న ఆమె టాలీవుడ్ స్టార్ హీరో సతీమణి. తెలుగు సంప్రదాయం ప్రకారం వచ్చే ప్రతి పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. గతంలోనూ అనేకసార్లు పండగలు, పూజలకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేసుకున్నారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైఫ్ అల్లు స్నేహారెడ్డి. ఈరోజు అట్లతద్ది పండగను వేకువజామునే సెలబ్రేట్ చేసుకున్నరాు. ఎర్రచీరలో అందంగా ముస్తాబై భర్త ఆయురారోగ్యాల కోసం దేవుడిని ప్రార్థించుకున్నారు. ప్రస్తుతం స్నేహరెడ్డి ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

ఇది చదవండి : OTT Movie: అంతుచిక్కని రహస్యాలు.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. మైథిలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..

అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై ఓ రేంజ్ హైప్ నెలకొంది. గతంలో బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టించిన పుష్పరాజ్..ఇప్పుడు ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలని అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది.

ఇది చదవండి : Tollywood: వణుకుపుట్టించే థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అస్సలు మిస్సవద్దు..

Tollywood: ఈ అరాచకం ఏందీ సామి.. ఎన్టీఆర్‏తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ.. ? ఇప్పుడు చూస్తే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సల్మాన్ కేసులో వెబ్ సిరీస్‌గా గ్యాంగ్‌ స్టర్ బిష్ణోయ్‌ జీవిత కథ.
సల్మాన్ కేసులో వెబ్ సిరీస్‌గా గ్యాంగ్‌ స్టర్ బిష్ణోయ్‌ జీవిత కథ.
బిగ్ బాస్‌ను వెంటాడుతోన్న వివాదాలు.. షో నడుస్తుందా.? ఆగుతుందా.?
బిగ్ బాస్‌ను వెంటాడుతోన్న వివాదాలు.. షో నడుస్తుందా.? ఆగుతుందా.?
పెళ్లికి 5 వేల కోట్లు.! మరి బర్త్‌డేకి ఎంత.? అంబానీ చిన్న కోడలా..
పెళ్లికి 5 వేల కోట్లు.! మరి బర్త్‌డేకి ఎంత.? అంబానీ చిన్న కోడలా..
చిక్కుల్లో తమన్నా.! టోకెన్‌ యాప్‌ మనీ లాండరింగ్‌ కేసులో తమన్నా..
చిక్కుల్లో తమన్నా.! టోకెన్‌ యాప్‌ మనీ లాండరింగ్‌ కేసులో తమన్నా..
బాలయ్య షోకి ఏపీ సీఎం.! ఈ సారి ముచ్చట వేరే లెవల్‌.!
బాలయ్య షోకి ఏపీ సీఎం.! ఈ సారి ముచ్చట వేరే లెవల్‌.!
OG నుంచి బయటికొచ్చిన దిమ్మతిరిగే పోస్టర్ | ప్రౌడ్ మూమెంట్.!
OG నుంచి బయటికొచ్చిన దిమ్మతిరిగే పోస్టర్ | ప్రౌడ్ మూమెంట్.!
తవ్వకాలలో బయటపడ్డ హనుమాన్ విగ్రహం.. తన్మయత్వంతో పూజలు..
తవ్వకాలలో బయటపడ్డ హనుమాన్ విగ్రహం.. తన్మయత్వంతో పూజలు..
యజమాని మృతిని జీర్ణించుకోలేని శునకం.. నెలరోజుల్లోనే
యజమాని మృతిని జీర్ణించుకోలేని శునకం.. నెలరోజుల్లోనే
దారి దోపిడి.. ఇలా కూడా చేస్తారు.. జాగ్రత్త
దారి దోపిడి.. ఇలా కూడా చేస్తారు.. జాగ్రత్త
రైలు కిటికీ నుంచి జారిపడ్డ చిన్నారి.. ఎక్కడ దొరికిందో తెలుసా ??
రైలు కిటికీ నుంచి జారిపడ్డ చిన్నారి.. ఎక్కడ దొరికిందో తెలుసా ??