26/11 ముంబై దాడులలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్ (Major) సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. డైరెక్టర్ శశికిరణ్ తిక్క.. అడివి శేష్ (Adivi Sesh) కాంబోలో వచ్చిన ఈ సినిమాకు ఉదయం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే సినిమాను వీక్షించిన ప్రేక్షకుల సినిమా పై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది.. సందీప్ జీవితంలోని సంఘటనం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని విడుదలకు ముందే పలు ప్రధాన నగరాల్లో ప్రీవ్యూ షోస్ ప్రదర్శించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 88 ప్రీమియర్ షోలకు .. మొత్తం హౌస్ ఫుల్ కలెక్షన్స్ నమోదు అయ్యాయట. అంటే అన్ని ప్రీమియర్ షోలకు టికెట్లు అమ్ముడు పోయాయి అంటూ చిత్రయూనిట్ సభ్యులు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకు ఇలాంటి అరుదైన ఘనత దక్కలేదట.. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా 88 ప్రీమియర్ షోలకు హౌస్ ఫుల్ కాలేదని.. కేవలం మేజర్ సినిమాకు మాత్రమే హౌస్ ఫుల్ అయ్యింది.. ఈ మూవీ మరో సెన్సెషన్ రికార్డ్ క్రియేట్ చేసిందట.
సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ అయిన జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇందులో అడివి శేష్ నటన అద్భుతమని.. డైరెక్టర్ శశి కిరణ్ తిక్క దర్శకత్వం, ఎమోషన్స్ వెండితెరపై చాలా అద్భుతంగా చూపించాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు.. తన కుమారుడి జీవితంలోని సంఘటనలను కళ్లకు కట్టినట్లుగా సినిమాగా చూపించారని.. సినిమాలో నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్ బాగుందన్నారు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి కె. ఉన్నికృష్ణన్. మేజర్ సినిమా తమ దుఃఖాన్ని మర్చిపోయేలా చేసిందని..తన కుమారుడి జీవితం ఎంతోమందికి స్పూర్తిగా నిలిచిందన్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి, శోభిత ధూళిపాళ్ల, సాయి మంజ్రేకర్ కీలకపాత్రలలో నటించారు.
#MajorTheFilm starts off on a RECORD note ?
For the FIRST TIME EVER IN INDIAN CINEMA, 88 Premiere shows SOLD OUT ??
This is the start of something Huge ?
Bharat Mata Ki Jai ?#Major ?? pic.twitter.com/DvpXiH6hXe
— GMB Entertainment – MajorTheFilm In CINEMAS NOW (@GMBents) June 3, 2022