యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) ప్రస్తుతం మేజర్ (Major) సినిమా హిట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. జూన్ 3న విడుదలైన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు, సినీ ప్రముఖుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 26/11 ముంబై టెర్రరిస్ట్ దాడులలో ప్రాణ త్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్ల వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఇందులో అడివి శేష్ మేజర్ సందీప్ పాత్రలో ఒదిగిపోయాడని.. ప్రతి ప్రేక్షకుడి చేత కన్నీళ్లు తెప్పించేలా సినిమా రూపొందించడంలో డైరెక్టర్ శశికిరణ్ సక్సెస్ అయ్యారంటూ ప్రశంసలు కురిపించారు..
తాజాగా మేజర్ సినిమా విజయవంతంగా నాల్గవ వారంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో అడివి శేష్ సోషల్ మీడియాలో ఆసక్తికర ట్వీట్ చేశారు… కరోనా సంక్షోభంలో ఒక మాట ఇచ్చాను.. మేజర్ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకువస్తానని.. ఇప్పుడు నా మాట నిలబెట్టుకున్నాను.. మేజర్ సినిమా నాల్గవ వారం థియేటర్లలో సందడి చేస్తుంది.. అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా సాయి ముంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, శోభితా ధూళిపాళ్ల, మురళి శర్మ, అనీష్ తదితరులు కీలకపాత్రలలో నటించగా.. శ్రీచరణ్ పాకాల అద్భుతమైన సంగీతం అందించారు..
ట్వీట్..
In the Pandemic, I promised #Major is a big screen experience. I kept my promise.
FOURTH week in theaters ! Let’s do this ?? #JaiHind #MajorTheFilm pic.twitter.com/9Wo0EZf1hO
— Adivi Sesh (@AdiviSesh) June 24, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.