Arjun Sarja BirthDay: 19ఏళ్ల వయసులోనే హీరోగా ఎంట్రీ.. కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్స్.. అర్జున్ ఆస్తి ఎంతో తెలుసా
అర్జున్ సినిమా కెరీర్ లోకి వచ్చి 43 ఏళ్ల అవుతోంది. ఇప్పటికీ సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు అర్జున్. హీరోగా, విలన్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా అందరి దృష్టిని ఆకర్షించాడు అర్జున్. కన్నడతో పాటు తమిళం, తెలుగు సినిమాల్లో హీరోగా, విలన్‌గా నటిస్తున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్ అని అభిమానులతో పిలుచుకునే ఆయన 150కి పైగా చిత్రాల్లో నటించారు.
యాక్షన్ హీరో అర్జున్ సర్జా తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు సుపరిచితులు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు అర్జున్. హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అర్జున్.. విలన్ గా కూడా చేశారు. అర్జున్ సినిమా కెరీర్ లోకి వచ్చి 43 ఏళ్ల అవుతోంది. ఇప్పటికీ సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు అర్జున్. హీరోగా, విలన్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా అందరి దృష్టిని ఆకర్షించాడు అర్జున్. కన్నడతో పాటు తమిళం, తెలుగు సినిమాల్లో హీరోగా, విలన్‌గా నటిస్తున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్ అని అభిమానులతో పిలుచుకునే ఆయన 150కి పైగా చిత్రాల్లో నటించారు. ఈరోజు (ఆగస్టు 15) పుట్టినరోజు జరుపుకుంటున్న అర్జున్‌కి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు అర్జున్ కు విషెస్ తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి : విక్రమార్కుడులో రవితేజను చితక్కొట్టిన ఈ నటి గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందంటే
అర్జున్ సర్జా కన్నడ నటుడు శక్తి ప్రసాద్ కుమారుడు. అర్జున్ హీరోగా 1981లో ‘సింధ మరి సామ్య’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా విశేష ఆదరణ పొందింది. హీరోగా ఎంట్రీ ఇచ్చే నాటికి అర్జున్ వయసు 19 ఏళ్లు మాత్రమే. 1984లో, రామనారాయణన్ దర్శకత్వం వహించిన ‘నంద్రి’ చిత్రంలో ఇద్దరు హీరోల్లో ఒకరిగా ఆయన తమిళ చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తమిళంతో పాటు కన్నడలోనూ నటించాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, స్క్రిప్ట్ రైటర్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. త్వరలో విడుదల కానున్న ‘మార్టిన్’ చిత్రానికి కథను రాసుకున్నాడు.
ఇది కూడా చదవండి : చేసిన సినిమా రూ.400కోట్లు వసూల్ చేసింది.. అయినా అద్దింట్లోనే ఉంటున్న టాలీవుడ్ హీరోయిన్..
దర్శకుడు శంకర్ తొలి చిత్రం ‘జెంటిల్‌మన్’లో అర్జున్ హీరోగా నటించాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ఇదొకటి. మణిరత్నం ‘కడల్’లో విలన్‌గా నటించారు. కొంతకాలం తర్వాత తమిళ సినిమాల్లో ఎక్కువగా కనిపించాడు. 40 ఏళ్లుగా సినిమా రంగంలో రాణిస్తున్న అర్జున్ సర్జా ఆస్తుల విలువ రూ.80 కోట్లు. అర్జున్ సినిమాకి కోటి రూపాయల పారితోషికం తీసుకుంటాడు. బీ ఎమ్ డబ్ల్యూ ఐ8, ఆడి కార్ ఇలా ఎన్నో రకాల కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. ఆంజనేయుడికి అమితమైన భక్తుడైన అర్జున్ చెన్నైలో ఓ ఆలయాన్ని కూడా నిర్మించారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అర్జున్‌కి పలువురు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..