రెండు పెళ్లిళ్లు.. ఇద్దరు భర్తలు చనిపోయారు.. ఇప్పుడు ఒంటరిగా ఉంటోన్న హీరోయిన్
చాలా మంది వ్యక్తిగత విషయాలతో నిరంతరం వార్తల్లో నిలిచారు. ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రెటీలు విడాకులు తీసుకుంటున్నారు. అర్రే మొన్నేగా వీరికి పెళ్లయింది అనుకునేలోగా విడిపోతున్నట్టు ప్రకటించి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది విడిపోయారు. మరికొంతమంది విడిపోతున్నారు కూడా.. అలాగే ఓ హీరోయిన్ రెండు పెళ్లిళ్లు చేసుకుంది.
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఒకటికి రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రేమలో పడటం, బ్రేకప్ లు, పెళ్లిళ్లు, విడాకులు ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా చూస్తూ ఉంటాం.. చాలా మంది వ్యక్తిగత విషయాలతో నిరంతరం వార్తల్లో నిలిచారు. ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రెటీలు విడాకులు తీసుకుంటున్నారు. అర్రే మొన్నేగా వీరికి పెళ్లయింది అనుకునేలోగా విడిపోతున్నట్టు ప్రకటించి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది విడిపోయారు. మరికొంతమంది విడిపోతున్నారు కూడా.. అలాగే ఓ హీరోయిన్ రెండు పెళ్లిళ్లు చేసుకుంది. కానీ ఆమె అవి సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఒంటరిగా జీవిస్తుంది. నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు 69ఏళ్ల వయసులో ఒంటరిగా జీవిస్తుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ నటి రేఖ తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి కొందరికే తెలుసు. ప్రస్తుతం రేఖ 69 ఏళ్ల వయసులో ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. రేఖ జీవితంలో ప్రేమ . పెళ్లి అన్ని జరిగాయి కానీ ఇప్పుడు ఒంటరిగా జీవిస్తుంది. సినిమాల్లో సక్సెస్ ఆయిన ఆమె వైవాహిక జీవితంలో మాత్రం సక్సెస్ కాలేకపోయారు. రేఖకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ ఆమె తన వైవాహిక జీవితాన్ని ఎప్పుడూ ఆనందించలేకపోయారు. పెళ్లయిన తర్వాత కూడా రేఖ చాలా సమస్యలను ఎదుర్కొంది. రెండు వివాహాలు విఫలమైన తర్వాత, మరోసారి రేఖ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోలేదు.
రేఖ గతంలో ఒకసారి తన వైవాహిక జీవితం గురించి మాట్లాడారు. పెళ్లయిన 6 నెలలకే రేఖ భర్త ముఖేష్ అగర్వాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లయిన ఆరు నెలలకే భర్త చనిపోవడంతో, రేఖను చాలా మంది విమర్శించారు. దారుణంగా మాట్లాడారు. ఆమె వల్లే ముఖేష్ చనిపోయాడు అంటూ నిందలు వేశారు.. అవమానించారు. అయితే ఓ ఇంటర్వ్యూలో రేఖ మాట్లాడుతూ.. అశక్య విషయం చెప్పింది. ముఖేష్ రేఖ నుంచి విడాకులు కోరుకున్నాడు. రేఖ మాత్రం తన భర్త నుంచి విడాకులు అడగలేదు. పెళ్లయ్యాక భర్త పెద్దగా పట్టించుకోలేదు. కానీ నేనెప్పుడూ సంబంధాన్ని వదులుకోలేదు’ అని రేఖ చెప్పింది. అలాగే మేం లండన్‌లో హనీమూన్‌కి వెళ్లాం. అయితే ముఖేష్‌తో తనకున్న రిలేషన్‌షిప్‌లో తేడా కనిపించిందని రేఖ తెలిపింది. ఆతర్వాత రేఖ దివంగత నటుడు వినోద్ మెహ్రాను వివాహం చేసుకున్నట్లు సమాచారం. కానీ వినోద్ మెహ్రా తల్లి రేఖను కోడలిగా అంగీకరించలేదు. వీరి పెళ్ళికి అంగీకరించపోవడంతో.. వినోద్ మెహ్రా, రేఖ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కానీ వారు ఈ సంబంధాన్ని ఎప్పుడూ బయటపెట్టలేదు. ఏ ఇంటర్వ్యూలోనూ వినోద్, రేఖ తమ పెళ్లి గురించి మాట్లాడలేదు. ఆతర్వాత ఆయన కూడా మరణించారు. రేఖ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఈరోజు 69 ఏళ్ల వయసులో ఆమె ఒంటరిగా జీవిస్తున్నాడు. 2018 తర్వాత సినిమాల్లో కూడా నటించలేదు. ఆమె ఇంతకుముందు అమితాబ్ బచ్చన్‌ని ప్రేమించినట్లు ప్రచారం కూడా జరిగింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..