మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కలిసి నటించిన ఆచార్య సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. చిరు చరణ్ ను కలిసి బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకున్న మెగా అభిమానుల కోరికను తీర్చారు దర్శకుడు కొరటాల శివ. ఇక ఆచార్య సినిమా రిలీజ్ కావడంతో థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తుంది. అభిమానులు చిరంజీవి, చరణ్ కటౌట్లకు పూలాభిషేకాలు, పాలాభిషేకాలతో సందడి చేస్తున్నారు. ఇందులో చరణ్ పాత్రకు ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంటుందని ముందునుంచి చెప్తున్నారు మేకర్స్. ఇందులో సిద్ధ అనే పాత్రలో చరణ్ నటించాడు. ఇప్పటికే విడుదలైన చరణ్ లుక్ ఆచార్య సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ఈ సినిమాలో చరణ్ , చిరు ఇద్దరు నక్సలైట్స్ గా కనిపించారు.
రిలీజ్ కు ముందు విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమా పైన అంచనాలను పెంచేసింది. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని మొదటి నుంచి చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక ఆచార్య సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఓవైపు చిరంజీవి, రామ్‌చరణ్‌ల మాస్ ఇమేజ్‌ను క్యారీ చేస్తూనే మరోవైపు, తనదైన శైలిలో సందేశాత్మక కథతో ప్రేక్షకులకు మెస్మరైజ్ చేశారనే చెప్పాలి. ఇక ఆచార్య థియేటర్స్ అభిమానుల కోలాహలం ,మాములుగా లేదు బెనిఫిట్ షో చూసేందుకు థియేట్సర్ దగ్గరకు భారీ గా చేరుకున్నారు అభిమానులు.
మరిన్ని ఇక్కడ చదవండి
ఆచార్య సినిమా టికెట్లను ఎక్కువ ధరలకు నమ్మకూడదని సినిమా థియేటర్ల యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చిన జమ్మలమడుగు ఆర్డిఓ శ్రీనివాసులు. పులివెందుల తాసిల్దార్ కార్యాలయంలో సినిమా థియేటర్ల యజమానులకు సమావేశం నిర్వహిచారు. అధిక ధరలకు టిక్కెట్ల అమ్మితే కేసులు నమోదు చేయాలని తహసిల్దార్ కు ఆదేశాలు జారీ చేశారు ఆర్డిఓ.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్యా ధియేటర్ వద్ద మెగా ఫ్యాన్స్ కోలాహలం నెలకొంది. వాయిదాలు పడుతూ వచ్చిన తమ బాస్ మూవీ ఆచార్య..ఎట్టకేలకు రిలీజవడంతో కేరింతలు కొడుతున్నారు. డాన్సులు చేస్తూ హంగామా చేస్తున్నారు.
ఇప్పటికే సినిమాకు హిట్ టాక్ రావడంతో మరింత జోష్‌లో ఉన్నారు మెగా ఫ్యాన్స్. థియేటర్స్ వద్ద చిరంజీవి, చరణ్ భారీ కటౌట్స్ ఏర్పాటుచేసి పాలాభిషేకాలు చేస్తున్నారు. కటౌట్స్‌కు హారతులు పడుతున్నారు.
మెగా డబుల్ ధమాకా .. ఆచార్య రివ్యూ..
ఆచార్య మువీ టికెట్లు ధరలు 200 రూపాయలు అయితే 600 రుపాయలు అమ్మారంటు ఆందోళనకు దిగిన చిరంజీవి అభిమానులు. యస్వీ థియేటర్లో బెనిఫిట్ షోకి పర్మీషన్ లేకున్నా అధిక ధరలకు టికెట్లు అమ్మి.. సినిమాను నాలుగు ఐదు సార్లు నిలిపి వేశారంటు థియేటర్ బయటికి వచ్చి ఆందోళనకు దిగిన అభిమానులు
ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది ఆచార్య. భారీ టార్గెట్‌తో ఆచార్య బరిలోకి దిగారు. ప్రీమియర్ షోస్ చూసిన ప్రేక్షకులు..సినిమా సూపర్ అంటూ హల్‌చల్ చేస్తున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అదరగొడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య మేనియా నెలకొంది. థియేటర్స్ వద్ద మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా రిలీజవడంతో.. మెగా అభిమానులు హంగామా చేస్తున్నారు.
Wishing Our Heart Of Industry Dearest #Megastar @KChiruTweets gaaru And My dear brother @AlwaysRamCharan a massive success for #Acharya ? #KoratalaSiva My Guru Shri #ManiSharma gaaru ❤️ pic.twitter.com/hwm8bN2MYN
— thaman S (@MusicThaman) April 28, 2022
థియేటర్స్ దగ్గర జై మెగాస్టార్.. జై జై మెగాపవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తున్న మెగా ఫ్యాన్స్. సినిమా సూపర్ హిట్ అంటున్న ప్రేక్షకులు.
ఊహించని ట్విస్ట్ సినిమాను తారాస్థాయికి తీసుకెళ్లిందంటున్న ప్రేక్షకులు.. అలాగే క్లైమాక్స్ ఏంటో ఎమోషనల్ గ ఉందని.. చక్కటి సందేశాన్ని కూడా ఇచ్చారని అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు.
థియేటర్స్ దగ్గర మెగాస్టార్ పాటలకు డ్యాన్స్ లు వేస్తున్న ఫ్యాన్స్.. చిరంజీవి , చరణ్ పోస్టర్లకు హారతి పడుతున్న అభిమానులు.
ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో రెజీనా కాసాండ్రా నటించిన విషయం తెలిసిందే. సానా కష్టం పాటలో రెజీనా కసాండ్రా గ్లామర్ తో ఆకట్టుకుంది.ఈ పాటలో చిరు స్టెప్పులు సూపర్ అంటున్నారు.
చిరంజీవి, రామ్ చరణ్ మధ్య సన్నివేశాలు థియేటర్స్ లో సీట్ ఎంచుకుని కూర్చోబెట్టేలా ఉన్నాయంటున్నారు ప్రేక్షకులు. అలాగే భలే బంజారా పాటలో ఇద్దరు తమ డ్యాన్స్ లతో ఆకట్టుకున్నారంటున్నారు.
సినిమా సూపర్ హిట్ అంటున్నారు సినిమా చూసిన ఫ్యాన్స్. మెగాస్టార్ , రామ్ చరణ్ మాస్ యాక్షన్ తో పటు కొరటాల స్టైల్ ఎమోషన్, మెసేజ్ ఆకట్టుకున్నాయని అంటున్నారు ప్రేక్షకులు.
తూ. గో జిల్లా.. కోనసీమ..కాకినాడ..జిల్లాలో మొదలైన ఆచార్య బెనిఫిట్ షో లు.. ఆచార్య సినిమా రిలీజ్ సందర్బంగా జిల్లాల వ్యాప్తంగా థియేటర్స్ వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. కొన్ని థియేటర్ లలో ఆరు షోలకి పర్మిషన్ కూడా ఇచ్చారు.