Kushi Movie: విజయ్ దేవరకొండ, సమంత జంటగా ‘ఖుషి’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ కశ్మీర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో షూటింగ్‌లో అపశ్రుతి చోటుచేసుకుందని.. హీరోహీరోయిన్లకు గాయాలయ్యాయని పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. దీనిపై ఖుషీ మూవీ పీఆర్ టీమ్ స్పందిస్తూ..
ఖుషి సినిమా షూటింగ్ లో విజయ్ దేవరకొండ, సమంత లకు గాయాలు అయినట్టు కొన్ని వెబ్ సైట్ లల్లో వార్తలు వస్తున్నాయి.అందులో ఎలాంటి వాస్తవం లేదు. టీం అంతా సక్సెస్ ఫుల్ గా కాశ్మీర్ లో 30 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకొని నిన్న నే హైదరాబాద్ తిరిగి వచ్చారు. రెండో షెడ్యూల్ అతి త్వరలోనే మొదలు కానుంది.దయచేసి ఎలాంటి పుకార్లు నమ్మొద్దు అంటూ చెప్పుకొచ్చింది మూవీ పీఆర్ టీమ్. ఇదిలా ఉంటే తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అటు సమంత, ఇటు విజయ్ ఈ సినిమాతో పాటు మరికొన్ని చిత్రాల షూటింగ్‌లలో బిజీగా ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..