- Telugu News Photo Gallery Cinema photos Tollywood actress aditi rao hydari about cannes film festival 2022
Aditi Rao Hydari : నేను పొట్టిగా ఉంటాను.. అందుకు నేనెప్పుడూ ఫిల్ అవ్వలేదు: అదితి
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాల్లో నటించి తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ అదితి రావ్ హైదరీ.
Updated on: May 23, 2022 | 9:36 PM

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాల్లో నటించి తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ అదితి రావ్ హైదరీ.

ఇటీవల మహా సముద్రం, హే సినామిక చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ

తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో మెరిసింది.

తాజాగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ... ఆసక్తికర కామెంట్స్ చేసింది అదితి

'నేను చాలా పొట్టిగా ఉంటాను. అందుకే కేన్స్ ఫెస్టివల్‌లో ఉన్న జిరాఫీలతో పోటీపడలేనని తన డిజైనర్ తో అన్నదట అదితి.

నేను నటిని. పొట్టిగా ఉన్నప్పటికీ నాకు బాధ లేదు. ఎందుకంటే నాలాగా ఉండటానికి నేను ఎంతో సౌకర్యవంతంగా ఫీల్ అవుతాను. అందుకే ధైర్యం చేసి ఫెస్టివల్‌లో పాల్గొంటాను.

రెడ్ కార్పెట్ పైన నడిచేటప్పుడు ఎదో ఒక పొరపాటు చేస్తాను.. అయినా పర్లేదు. అంతా మన మంచికే. దాని నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు అని చెప్పుకొచ్చింది.




