Abdu Rogic: నిశ్చితార్థం జరిగిన 6నెలలకు పెళ్లి క్యాన్సిల్.. ఎమోషనల్ అయిన అబ్దు
బిగ్ బాస్ హోస్ట్ , బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అతనంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. 19 ఏళ్ల అబ్దుకు అమీరాతో ఏప్రిల్ 24, 2024న నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి తన పెళ్లి విషయంలోఅతను ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అబ్దు పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘బిగ్ బాస్ 16’ ఫేమ్ అబ్దు రోజిక్ తన వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. హిందీ బిగ్ బాస్ షోలో పాల్గొని అందరిని ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ హోస్ట్ , బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అతనంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. 19 ఏళ్ల అబ్దుకు అమీరాతో ఏప్రిల్ 24, 2024న నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి తన పెళ్లి విషయంలోఅతను ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అబ్దు పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతను కూడా తన వధువును చూడాలని చాలా తహతహలాడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అబ్దు అభిమానులకు బ్యాడ్ న్యూస్. అమీరాతో అబ్దు తన వివాహాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. అబ్దు చేసిన ఈ ప్రకటన తరువాత అందరూ షాక్ అయ్యారు.
ఇది కూడా చదవండి : పట్టుకుంటే కందిపోతుందేమో ఈ చిన్నది.. జయం సినిమా చిన్నది ఎంత అందంగా ఉందో..!
కజకిస్తానీ గాయకుడు అబ్దు ఒక ఇంటర్వ్యూలో తన వివాహం జూలై 2024లో జరగాల్సి ఉందని, అయితే తర్వాత అది వాయిదా పడిందని చెప్పారు. ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో అబ్దు మాట్లాడుతూ, నేను ఇప్పుడు ఈ వివాహాన్నిక్యాన్సిల్ చేస్తున్నందుకు చాలా బాధగా ఉంది. మా సంబంధం బలపడతంతో, సాంస్కృతిక విభేదాలు తలెత్తడం ప్రారంభించాయి. అటువంటి పరిస్థితిలో, వీటన్నిటి కారణంగా మేము పెళ్లి క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని తెలిపాడు.
ఇది కూడా చదవండి :Samantha : ఇండస్ట్రీలో ఆయనే నాకు గురువు.. స్టార్ హీరో పై ప్రేమ కురిపించిన సామ్
ప్రేమ కోసం అన్వేషణ తన జీవితంలో కొనసాగుతుందని అబ్దు చెప్పాడు. అబ్దు మాట్లాడుతూ.. “నేను ఈ రోజు ఏమైనప్పటికీ, దాని కోసం ప్రజలందరికీ నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. ఎందుకంటే నేను ఎలా ఉన్నానో, మీ అందరికీ నాకు తెలుసు, నేను నాలా ఉన్నందుకు నేను ఎప్పుడూ బాధపడను. నేను ఏర్పరచుకున్న సంబంధాలను, స్నేహాలను నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. భవిష్యత్తులో మళ్లీ ప్రేమను పొందాలని ఆశిస్తున్నాను. మీ శుభాకాంక్షలకు నేను కృతజ్ఞుడను” అని తెలిపాడు అబ్దు. అబ్దు రోజిక్, అమీరాతో ఏప్రిల్ 24, 2024న యూఏఈ లోని షార్జాలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం ఈ వార్త వైరల్ అయ్యింది.
ఇది కూడా చదవండి : ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.