AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamir Khan: నా రూటే సపరేటు గురూ.. ఓటీటీలకు చుక్కలు చూపిస్తోన్న అమీర్ ఖాన్

ఇటీవల కాలంలో ఓటీటీల హావా బాగా పెరిగిపోయిన విషయం తెలిసిందే.. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా రిలీజ్ అయినా కొద్దిరోజులకే ఓటీటీల్లో సినిమాలు ప్రత్యక్షం అవుతున్నాయి.

Aamir Khan: నా రూటే సపరేటు గురూ.. ఓటీటీలకు చుక్కలు చూపిస్తోన్న అమీర్ ఖాన్
Aamir Khan
Rajeev Rayala
|

Updated on: Jul 30, 2022 | 8:21 AM

Share

ఇటీవల కాలంలో ఓటీటీ(OTT )ల హావా బాగా పెరిగిపోయిన విషయం తెలిసిందే.. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా రిలీజ్ అయినా కొద్దిరోజులకే ఓటీటీల్లో సినిమాలు ప్రత్యక్షం అవుతున్నాయి. దాంతో థియేటర్స్ కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుందని ప్రడ్యూసర్స్ మొత్తుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. సినిమా రిలీజ్ అయినా రెండు, మూడు వారలకే ఓటీటీలో సినిమా రావడంతో నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందని కొందరు ఆందోళన చేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో కూడా ఇదే పరిస్థితీ స్టార్ హీరోల సినిమాలు థియేటర్స్ లో కంటే ఓటీటీలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్టార్ హీరో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి హీరోల సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. ఇక థియేటర్స్ తో పోల్చుకుంటే ఓటీటీల్లోనే కొన్ని సినిమాలకు మంచి వ్యూవర్ షిప్ దక్కుతోంది. అయితే తన సినిమాను మాత్రం అంత తొందరగా ఓటీటీకి వదలనంటున్నారు స్టార్ హీరో అమీర్ ఖాన్(Aamir Khan).

అమీర్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చడ్డా. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్- కిరణ్ రావు – వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించాయి. ఈ ఏడాది ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు-తమిళం-హిందీలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కీలక పాత్రలోని నటిస్తున్నారు. ఈ మూవీని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు. అయితే ఈ సినిమా ను ఆరు నెలల తర్వాతనే ఓటీటీలో రిలీజ్ చేస్తామని అమీర్ ఖాన్ ప్రకటించారు. ఇక ఈ సినిమాను ఇండియన్, జపాన్, చైనా అన్ని భాషల్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట అమీర్. 6 నెలల వరకు సినిమా ఓటీటీకి రాదు కాబట్టి ప్రేక్షకులు థియేటర్స్ లోనే ఈ సినిమా చూడాల్సిందే అనే విశ్లేషకులు అంటున్నారు. ఇక ఈ సినిమా పై అమీర్ ఖాన్ చాలా ధీమాగా ఉన్నారు. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ ఆనుతుందని అమీర్ ఖాన్, చిత్రయూనిట్ నమ్ముతున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఈ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌