India Pakistan War: భారత్-పాక్ కాల్పుల విరమణ.. సెలబ్రిటీల రియాక్షన్ ఏంటంటే?

గత కొన్ని రోజులుగా భారత్‌-పాక్‌ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ విషయాన్ని పాక్ తో పాటు భారత విదేశాంగశాఖ అధికారికంగా ప్రకటించింది. శనివారం (మే10) సాయంత్రం 5గంటల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు తెలిపింది.

India Pakistan War: భారత్-పాక్ కాల్పుల విరమణ.. సెలబ్రిటీల రియాక్షన్ ఏంటంటే?
Aamir Khan, Saif Ali Khan

Updated on: May 10, 2025 | 8:50 PM

పహల్గామ్ దాడి తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్ తో పాటు పీఓకేలో దాక్కున్న ఉగ్రవాదులను మట్టు బెట్టింది. వారి స్థావరాలను కూడా సమూలంగా నాశనం చేశాయి. కాగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులందరూ స్పందించారు. అయితే కొందరు బాలీవుడ్ నటులు స్పందించలేదని విమర్శలు వచ్చాయి. తాజాగా ఇదే విషయంపై బాలీవుడ్ సీనియర్ నటుడు, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ స్పందించారు. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ లపై స్పందించిన ఆయన భవిష్యత్తులో ఇలాంటి ఉగ్రదాడులు మళ్లీ జరగకుండా భారతీయులకు గట్టి భరోసా కావాలని ఆమిర్ అభిప్రాయపడ్డాడు. “మాకు న్యాయం కావాలి. ఉగ్రవాద దాడులు మళ్లీ జరగవని హామీ ఇవ్వాలి. మా ప్రభుత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఉగ్రదాడికి పాల్పడిన సామాజిక వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటారని మాకు నమ్మకముంది’ అని ఆమిర్ ఖాన్ తెలిపాడు.

అటు ఆపరేషన్ సిందూర్ పై నటుడు సైఫ్ అలీ ఖాన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పహల్గామ్‌లో అమాయకుల ఊచకోత దారుణం. ఈ ఉగ్రవాద దాడితో ఛిన్నాభిన్నమైన కుటుంబాలకు నా సంఘీభావం తెలియజేస్తున్నాను. అలాగే మన సాయుధ దళాల ధైర్యానికి నేను సెల్యూట్ చేస్తున్నాను. మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనమందరం ఐక్యంగా నిలబడాలి’ అని తన ప్రకటనలో పేర్కొన్నాడు సైఫ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.