ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం RAPO19. ఈ సినిమాకు తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో మరో హీరో ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈరోజు ఆది పినిశెట్టి పుట్టిన రోజు కావడంతో ఆది పినిశెట్టికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
తాజాగా విడుదలైన పోస్టర్లో రఫ్ లుక్లో కనిపిస్తున్న ఆది పినిశెట్టి ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆది పినిశెట్టి.. సరైనోడు.. రంగస్థలం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కేవలం హీరోగానే కాకుండా.. విలన్ పాత్రలలోనూ ఆది పినిశెట్టి తన నటనతో మెప్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 50 శాతంకుపైగా షూటింగ్ పూర్తయ్యింది.
Here’s wishing a very happy birthday and a great year ahead to #Aadhi, who is set to enthrall us in #RAPO19.#HBDAadhiPinisetty @ramsayz @AadhiOfficial @dirlingusamy @IamKrithiShetty @srinivasaaoffl @iAksharaGowda @ThisIsDSP @sujithvasudev @PeterHeinOffl @anbariv@adityamusic pic.twitter.com/EqJFhKMoGY
— BA Raju’s Team (@baraju_SuperHit) December 14, 2021
Radhe shyam: ‘సంచారి’ గా చక్కర్లు కొడుతున్న డార్లింగ్.. రాధేశ్యామ్ నుంచి సాంగ్ టీజర్..
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుకు సర్జరీ.. దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న హీరో..