Ram Charan: చరణ్.. శంకర్ సినిమా పై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. అందుకోసం భారీ సెట్..

మెగా పవర్ స్టార్ రామ్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‏తో

Ram Charan: చరణ్.. శంకర్ సినిమా పై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. అందుకోసం భారీ సెట్..
Ram Charan

Edited By:

Updated on: Nov 20, 2021 | 7:06 PM

మెగా పవర్ స్టార్ రామ్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా రేంజ్‏లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాప్ ప్రొడ్యుసర్ దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేశారు మేకర్స్. పూనే, స‌తారా, పాల్‌ట‌న్ ప్రాంతాల్లో స్పెష‌ల్ సీక్వెన్స్‌ల‌ను ఈ షెడ్యూల్‌లో చిత్రీక‌రించారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్‏ను హైదరాబాద్‏లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనెల 15న ప్రారంభించారు. ఇక్కడ చరణ్, కియారా అద్వాని కాంబోలో కొన్ని రొమాంటిక్ సీన్స్ చిత్రీకరిస్తున్నారట. ఇందుకోసం ఇక్కడ భారీ సెట్ వేయిస్తున్నారట. అంటే ఆ సెట్ కోసం దాదాపు రూ. 40 కోట్లను కేటాయించినట్లుగా టాక్. రజినీ కాంత్ నటించిన శివాజీ సినిమాలోని వాజీ వాజీ .. అనే పాట తరహాలో డిజైన్ చేసినట్టుగా సెట్ వేయిస్తున్నట్లుగా సమాచారం. దీంతో శంకర్ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి అంటున్నారు నెటిజన్స్. ఈ సినిమాలో జ‌యరామ్‌, అంజ‌లి, సునీల్, శ్రీకాంత్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు కీలక పాత్రలలో నటిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు రామ్ చరణ్.. ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Also Read: Bigg Boss 5 Telugu: సిరి, షణ్ముఖ్ రిలేషన్ పై నాగ్ ఫైర్.. సిరి పరువు తీసి.. షణ్ముఖ్‏కు క్లాస్..

Laal Singh Chaddha: అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా నుంచి స్పెషల్ అప్డేట్.. నాగచైతన్య మూవీ రిలీజ్ ఎప్పుడంటే..

Naga Babu: చంద్రబాబు కంటతడి పెట్టడంపై స్పందించిన మెగా బ్రదర్‌.. అసెంబ్లీ పరిణామాలపై సీరియస్ కామెంట్స్..

Andhra Pradesh Politics: ఏపీ అసెంబ్లీ పరిణామాలపై నారా ఫ్యామిలీ ఫైర్.. సంచలన కామెంట్స్ చేసిన రోహిత్..