Cinema: థియేటర్లలో సినిమాల పండుగ.. ఒక్కరోజే 10 చిత్రాలు రిలీజ్.. ఈ రెండు సినిమాలు డోంట్ మిస్..
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద చిన్నా, పెద్ద సినిమాలు దుమ్మురేపుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. అయితే ఇటీవల వరుసగా సినిమాలు రిలీజయి మంచి విజయాలు సాధిస్తున్న వేళ.. ఇప్పుడు ఈ వారం కూడా మరిన్ని చిత్రాలు ప్రక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. ఈ వారం ఏకంగా పది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అసలు ఇందులో సగం సినిమాలు ఉన్నాయని కూడా జనాలకు తెలుసో లేదో.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ వారం వినోదాల విందు నెలకొనబోతోంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా వరుస సెలవులు రావడం, వీకెండ్ కలసిరావడంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున సినిమాలు పోటీకి దిగుతున్నాయి. ఏకంగా ఒకే రోజు దాదాపు 10 సినిమాలు థియేటర్లలోకి రానుండటంతో సినీ ప్రియులకు పండుగ వాతావరణం నెలకొంది. చిన్న సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు, భారీ కాన్సెప్ట్ సినిమాలు ఇలా రకరకాల జోనర్లలో ప్రేక్షకులు అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారం విడుదలవుతున్న చిత్రాల్లో ప్రధానంగా ఆకట్టుకుంటున్నది ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ హీరోగా శశాంక్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ కామెడీ డ్రామాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఆర్కా మీడియా, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‌తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..
మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘సిగ్మా’. సందీప్ కిషన్ కథానాయకుడిగా, ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించిన ఈ హీస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మనవడు, నటుడు విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించడం విశేషం. వీటితో పాటు నివిన్ పౌలీ, సూరి కాంబినేషన్‌లో రామ్ దర్శకత్వం వహించిన తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ ‘సంచారి’ కూడా తెలుగులో అలరించేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ నుంచి అజయ్ దేవగణ్, టబు కాంబినేషన్లో రూపొందిన థ్రిల్లర్ మూవీ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ సైతం ఇదే రోజున బాక్సాఫీస్ బరిలో నిలుస్తోంది. ఈ చిత్రాలు సైతం అక్టోబర్ 2న రిలీజ్ కానున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్.. ఒక్క పాటతో గెల్డోన్ బ్యూటీగా మార్చిన రాఘవేంద్రరావు.. ఇప్పటికీ ఆమె తోపు యాక్టర్..
యూత్‌ను ఆకట్టుకునే కథాంశాలతో హర్ష్ రోషన్ నటించిన ‘తెల్లకాగితం’, దినేష్ తేజ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘తత్వం’ వంటి విభిన్నమైన చిన్న చిత్రాలు కూడా థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాయి. వీటికి తోడుగా కొన్ని ఇతర ప్రాంతీయ చిత్రాలు, రీ-రిలీజ్ సినిమాలు కూడా పోటీలో ఉండటంతో థియేటర్ల వద్ద సందడి నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ భారీ బాక్సాఫీస్ రేసులో ఏ సినిమాలు ప్రేక్షకులను మెప్పించి విజయాన్ని అందుకుంటాయో చూడాలి!
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..
ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార..




