టాలీవుడ్ డ్రగ్స్ డైరీ.. విచారణకు హాజరైన నందు.. బ్యాంక్ లావాదేవీలపై ఈడీ ఆరా..

|

Sep 07, 2021 | 9:56 PM

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తును కొనసాగిస్తోంది. తాజాగా విచారణలో భాగంగా నటుడు నందు హైదరాబాద్‌లోని..

టాలీవుడ్ డ్రగ్స్ డైరీ.. విచారణకు హాజరైన నందు.. బ్యాంక్ లావాదేవీలపై ఈడీ ఆరా..
Nandu
Follow us on

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తును కొనసాగిస్తోంది. తాజాగా విచారణలో భాగంగా నటుడు నందు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట హాజరయ్యారు. అనుమానాస్పద లావాదేవీలపై నందుపై మూడు గంటలుగా ఈడీ ఆధికారులు ప్రశ్నిస్తున్నారు. అలాగే నందు బ్యాంక్ లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తోంది.

ఇదిలా ఉంటే.. డ్రగ్స్‌ వినియోగం, డ్రగ్స్‌ సరఫరా, మనీ లాండరింగ్‌, ఫెమా వంటి వాటిపై.. ఇప్పటికే విచారణకు హాజరైన టాలీవుడ్‌ స్టార్స్‌పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌, నటి ఛార్మి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ని అధికారులు విచారించారు.

మరోవైపు ఈ కేసులో షెడ్యూల్ ప్రకారం కాకుండా సినీ తారలు ముందే హాజరు కావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొన్న రకుల్ ప్రీతి సింగ్.. ఇవాళ నందు విచారణకు ముందుగానే హాజరయ్యారు. వాస్తవానికి ఈ నెల 20న నందు హాజరు కావాల్సి ఉంది. ఇలా సినీతారలు విచారణకు ముందుగానే హాజరుకావడం వెనుక పర్సనల్ రీజన్స్ ఉన్నాయా.? లేక ఇదంతా ఈడీ ప్లాన్‌లో భాగమా.? అని తెలియాల్సి ఉంది. కాగా, విచారణలో ప్రధాన పాత్రధారులుగా తేలితే షెడ్యూల్‌లో ఈడీ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:

తెలంగాణ: స్కూల్స్‌లో ఫిజికల్ క్లాసులు.. మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి తిరుమలలో ఉచిత దర్శనాలు..

 పొదల్లో దాగున్న పులి.. కనిపెట్టండి చూద్దాం మరీ.. పజిల్ మాత్రం చాలా కష్టం గురూ!

ఈ బుడ్డోడికి సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే.. ఎవరో గుర్తుపట్టండి.!

కొండచిలువతో క్రేజీ ఆటలు.. కోపంతో విషసర్పం దాడి.. గగుర్పొడిచే వీడియో!

3 మ్యాచ్‌ల్లో 2 అర్ధ సెంచరీలు.. 4 టెస్టులతో కెరీర్ క్లోజ్.. ఈ టీమిండియా ప్లేయర్ ఎవరంటే.?