Srikanth Addala : కొత్త హీరోతో రాబోతున్న శ్రీకాంత్ అడ్డాల.. ‘కూచిపూడి వారి వీధిలో’ అనే టైటిల్‌‌‌‌‌‌తో సినిమా..

'ముకుంద' సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలా.. ఈ సినిమా తోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసాడు శ్రీకాంత్...

Srikanth Addala : కొత్త హీరోతో రాబోతున్న శ్రీకాంత్ అడ్డాల.. 'కూచిపూడి వారి వీధిలో' అనే టైటిల్‌‌‌‌‌‌తో సినిమా..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 23, 2021 | 5:28 AM

Srikanth Addala : ‘ముకుంద’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలా.. ఈ సినిమా తోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసాడు శ్రీకాంత్. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు-సీనియర్ హీరో వెంకటేష్ తో కలిసి ‘సీతమ్మవాకిట్లో’ సిరిమల్లె చెట్టు సినిమా చేసాడు శ్రీకాంత్. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

శ్రీకాంత్ సినిమాలు అంటే అచ్చమైన తెలుగుతనం ఉట్టిపడుతుంది. ప్రస్తుతం వెంకటేష్ తో ‘నారప్ప’ సినిమా చేస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల. తమిళంలో ఘన విజయం సాధించిన ‘అసురన్’ సినిమాకు ఇది రీమేక్. ఈ మూవీ ఫినిష్ చేసిన తర్వాత కొత్త హీరో ప్రాజెక్టను చేపట్టబోతున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఈ క్రమంలో మరో హీరోను కూడా టాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నాడట శ్రీకాంత్. ఓ ప్రముఖ నిర్మాత కుమారుడి ఎంట్రీ కోసం శ్రీకాంత్ ప్రయత్నాలు చేస్తున్నారట. పలు సినిమాల నిర్మించిన చంటి అడ్డాల.. తన తనయుడిని హీరోగా పరిచయం చేయనున్నారు. ఈ సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తుండగా.. బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి ‘కూచిపూడి వారి వీధిలో’ అనే ఆసక్తికరమైన టైటిల్ రిజిస్టర్ చేయించారు. పూర్తిగా గోదావరి జిల్లాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

RRR Movie Update: దర్శకదీరుడికి షాక్ ఇచ్చిన ఐరిష్ నటి.. ఆనందంలో అభిమానులు.. షాక్‏లో చిత్రయూనిట్..