Thalapathi vijay : విజయ్ నెక్స్ట్ సినిమా కోసం సన్నాహాలు.. ఆ హీరో కోసం రాసుకున్న కథ దళపతి దగ్గరకు వచ్చిందట..
దళపతి విజయ్ ఇటీవల మాస్టర్ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా తమిళ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలానే తెలుగు లో కూడా..
Thalapathi vijay : దళపతి విజయ్ ఇటీవల మాస్టర్ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా తమిళ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలానే తెలుగు లో కూడా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ డాక్టర్ ఫేం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఇప్పడు మాస్టర్ సినిమా విడుదల కూడా కావడంతో త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నారు. అయితే ఈ కథ విజయ్ కోసం రాసింది కాదట. హీరో శివకార్తీ కేయన్ కోసం నెల్సన్ దిలీప్ కుమార్ కథను సిద్ధంచేసారట. అయితే చివరిలో ఈ కథను విజయ్ కు వినిపించాడట. విజయ్ కు కూడా కథ నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ టాక్. అయితే నెల్సన్ దిలీప్ కుమార్ ముందుగా ఈ కథను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ అదే స్క్రిప్ట్ ను విజయ్ కు వివరించాలని నెల్సన్ ని కోరిందట.
మరిన్ని ఇక్కడ చదవండి :
Actor Megastar Chiranjeevi: ఆ నలుగురు క్యాప్టెన్స్తో చిరంజీవి.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..