సినిమా పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. టాలీవుడ్ విషయానికొస్తే.. కొద్ది రోజుల క్రితం మంచు మనోజ్ కుమార్ ఈ మహమ్మారి బాధితుల జాబితాలో చేరగా.. తాజాగా అతని సోదరి మంచు లక్ష్మి కరోనాకు గురైంది. ఆమే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ‘రెండేళ్ల నుంచి బూచోడు లాంటి కరోనా వైరస్ నుంచి తప్పించుకుని తిరుగుతున్నాను. కానీ చివరికి దాని చేతిక చిక్కక తప్పలేదు. దానితో పోరాడేందుకు ఎంతో ప్రయత్నించాను. కానీ దానికి వేరే ప్రణాళికలు ఉన్నాయనుకుంటాను. అందుకే నన్ను విడిచిపెట్టలేదు. కరోనాకు చికిత్స తీసుకుంటున్నాను. నాకు ఉన్న కలరీ స్కిల్స్‌తో దాన్ని ఎలాగైనా దూరంగా పంపిస్తాను’ అని రాసుకొచ్చింది మంచు లక్ష్మి.
దీంతో పాటు కరోనా రక్షణకు సంబంధించి తన అభిమానులకు కొన్ని జాగ్రత్తలు సూచించిందీ మల్టీ ట్యాలెంటెడ్ నటి. ‘అందరూ ఇంట్లో సురక్షితంగా ఉండండి. మాస్కులు తప్పనిసరిగా ధరించండి. వ్యాక్సిన్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ఇప్పటికే రెండు డోసుల టీకా తీసుకొనిఉంటే.. బూస్టర్( మూడో డోస్) కూడా తీసుకునేందుకు ప్రయత్నించండి. అలాగే టైమ్ పాస్ కోసం మీకు నచ్చిన టాప్-3 సినిమాలు, షోలు, ప్యాడ్‌కాస్ట్‌లు ఉంటే చెప్పండి. చూసి ఆనందిస్తాను’ అని వరుస ట్వీట్లు పెట్టింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు కోరుతూ కామెంట్లు పెడుతున్నారు.
It’s going to affect everybody and get all of us just like a common cold. What we need to do is take care of our immunity and make sure our bodies are strong enough to fight the virus. So don’t forget to take your vitamins and keep your mind and body in check. pic.twitter.com/cs5x0Rhewd
— Lakshmi Manchu (@LakshmiManchu) January 6, 2022
Also Read: