AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నటుడు గుర్తున్నాడా.? ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో ఎక్కువగా నటించిన ఈయన ఎలా చనిపోయాడో తెలుసా.?

కోసూరి వేణు గోపాల్.. ఈ పేరు వింటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు.. కానీ పై ఫొటో చూస్తే ఇట్టే గుర్తు పడతారు. గంభీరమైన గొంతు, భారీ కాయంతో కనిపించే ఈయన తన దైన నటనతో తెలుగు ఆడియెన్స్ ను మెప్పించారు.

ఈ నటుడు గుర్తున్నాడా.? ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో ఎక్కువగా నటించిన ఈయన ఎలా చనిపోయాడో తెలుసా.?
Kosuri Venugopal
Rajeev Rayala
|

Updated on: Oct 27, 2026 | 12:06 PM

Share

పై ఫొటోలో కనిపిస్తున్న నటుడిని గుర్తుపట్టారా.? చాలా సినిమాల్లో రకరకాల పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు ఆయన. కామెడీ, విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో రకాల పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు ఆయన.. ఆ నటుడి పేరు కోసూరి వేణు గోపాల్..హీరోల తండ్రి పాత్రల్లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు ఈయన. తన దైన నటనతో తెలుగు ఆడియెన్స్ ను మెప్పించారు. చాలా సినిమాల్లో రకరకాల పాత్రలు చేసిన ఆయన ఎక్కువగా రాజమౌళి సినిమాల్లో కనిపిస్తారు. దర్శక ధీరుడు రాజమౌళి సినిమాల్లో రకరాల పాత్రలు పోషించారు వేణు గోపాల్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన కోసూరి చాలా ఏళ్ల పాటు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలో పని చేశారు. అయితే నటననపై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు వేణు గోపాల్. పి. ఎన్. రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన తెగింపు అనే చిత్రంతో నటుడుగా తన సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు వేణు గోపాల్. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశారు. ముఖ్యంగా రాజమౌళి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నంబర్ 1 తప్ప రాజమౌళి తెరకెక్కించిన అన్ని సినిమాల్లో కోసూరి నటించడం విశేషం. ముఖ్యంగా మర్యాద రామన్న సినిమాలో బ్రహ్మాజీ తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు వేణు గోపాల్. ఛత్రపతి, విక్రమార్కుడు, పిల్ల జమీందారు, భలేభలే మగాడివోయ్, అమీతుమీ, ఛలో.. ఇలా దాదాపు 30 సినిమాల్లో నటించారు కోసూరి వేణు గోపాల్.

కాగా నటునిగా బిజీగా ఉన్న సమయంలోనే ఈయన కన్నుమూశారు. మహమ్మారి కరోనా కారణంగా కన్నుమూసిన నటుల్లో కోసూరి కూడా ఒకరు. కరోనాతో హైదరాబాదులోని గచ్చిబౌలిలో, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సుమారు 23 రోజుల పాటు వెంటిలేటర్ మీద ఉన్నారు ఆయన. ఆ తర్వాత కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాత కొన్ని రోజులకు ఆయన ఆరోగ్యం క్షీణించింది. 2020 సెప్టెంబరు 23 న  కన్నుమూశారు వేణు గోపాల్. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us