AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళికి బెస్ట్ లడ్డూ.. ఈ స్వీట్ తిన్నా షుగర్ పెరగదు..

దీపావళి పండుగ వచ్చిందంటే చాలు చాలా మంది ఎక్కువగా స్వీట్ తినడానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ డయాబెటీస్‌తో బాధపడే వారు, ఎక్కువగా స్వీట్ తినడానికి ఆసక్తి చూపని వారు స్వీట్ తినే విషయంలో ఆలోచిస్తుంటారు. అయితే అలాంటి వారి కోసమే ఈ స్పెషల్ స్వీట్.

Samatha J
|

Updated on: Oct 27, 2026 | 10:35 AM

Share
దీపావళి పండుగ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మీ నోటిని తీపి చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే షుగర్ లేని ఈ లడ్డూ ప్రిపేర్ చేసుకోవాలి.  ఇంతకీ అది ఏమిటి అంటే,  ప్రోటీన్ బాదం లడ్డూ. శక్తినిచ్చే ఈ లడ్డూలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. శుద్ధి చేసిన చక్కెర లేకుండా, సహజంగా తీపిగా ఉండే ఈ లడ్డూలు ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా ఫిట్‌నెస్ ప్రియులకు, పిల్లలకు, పండుగల సమయంలో కూడా  తినడానికి ఇది చాలా బెస్ట్.

1 / 5
 తయారీ విధానంలోకి వెళ్లితే.. ఈ లడ్డు తయారీ కోసం  బాదం, నువ్వులు, ఖర్జూర లేదా, అంజూర్ తీసుకోవాలి. ముందుగా, ఒక కప్పు బాదంను తక్కువ మంటపై మూడు నుండి నాలుగు నిమిషాలు సువాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. బాదంను సూపర్ ఫుడ్ అంటారు. అదేవిధంగా, ఒక కప్పు నువ్వులను సుమారు ఒక నిమిషం పాటు తక్కువ మంటపై నిరంతరం కలుపుతూ వేయించి పక్కన ఉంచుకోవాలి. నువ్వులలో పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

2 / 5
వేరుగా ఉంచిన బాదం, నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత, వాటిని బ్లెండర్‌లో వేసి  బ్లెండ్ చేయండి. ఇప్పుడు ఒక కప్పు  అంజూర లేదా ఖర్జూరను కూడా అందులో వేసి బ్లైండ్ చేయండి. అంజూర లేదా ఖర్జూర సహజమైన తీపిని, రుచిని అందిస్తుంది.

3 / 5
వీటిని బాగా కలిపిన  తర్వాత, ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి మార్చి, రెండు టేబుల్ స్పూన్ల తరిగిన బాదం వేసి బాగా కలపాలి. మిశ్రమం పొడిగా అనిపిస్తే, కొద్దిగా వెచ్చని నెయ్యి వేసి కలపవచ్చు. ఇప్పుడు చిన్న భాగాలుగా తీసుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి.

4 / 5
మీ ఆరోగ్యకరమైన బాదం ప్రోటీన్ లడ్డూలు సిద్ధంగా ఉన్నాయి. బాదం ప్రోటీన్ , ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తుంది, నువ్వులు కాల్షియం మరియు ఐరన్‌తో నిండి ఉంటాయి. అంజూర లేదా ఖర్జూర సహజ స్వీటెనర్‌గా పనిచేస్తుంది. ఇది శుద్ధి చేసిన చక్కెర లేకుండానే గొప్ప రుచిని అందించే ఒక శక్తివంతమైన, ఆరోగ్యకరమైన చిరుతిండి. తక్షణ శక్తి కోసం ఎప్పుడైనా వీటిని ఆనందించవచ్చు.

5 / 5
Follow Us