AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్డును ఎలా వండి తింటే ఎక్కువ ప్రొటీన్ లభిస్తుంది? ఉడకబెట్టాలా? ఫ్రై చేయాలా?

ఆరోగ్యకరమైన ఆహారంలో కోడిగుడ్డుకు ప్రత్యేక స్థానం ఉంది. తక్కువ ధరలో ఎక్కువ నాణ్యమైన ప్రొటీన్ అందించే ఆహార పదార్థాలలో ఇది ప్రథమ వరుసలో నిలుస్తుంది. అయితే గుడ్డును ఉడకబెట్టి తింటే మంచిదా, ఆమ్లెట్ లేదా ఫ్రై చేసి తింటే మంచిదా, లేదా పొరటు చేసుకుని తింటే ఎక్కువ ప్రొటీన్ లభిస్తుందా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ వంట పద్ధతుల వల్ల గుడ్డులోని పోషకాల పరిమాణం మారుతుందా అనే విషయమై ప్రముఖ ఆహార నిపుణులు స్పష్టత ఇచ్చారు.

గుడ్డును ఎలా వండి తింటే ఎక్కువ ప్రొటీన్ లభిస్తుంది? ఉడకబెట్టాలా? ఫ్రై చేయాలా?
Egg Protein Benefits
Jyothi Gadda
|

Updated on: Oct 27, 2026 | 10:25 AM

Share

కోడిగుడ్డును ఉడకబెట్టినా, పొరటు చేసినా, ఆమ్లెట్‌గా వేయించినా లేదా హాఫ్ బాయిల్ చేసినా దానిలోని ప్రొటీన్ పరిమాణంలో ఎలాంటి మార్పూ ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒక పెద్ద గుడ్డులో సుమారు 6.3 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. వంట చేసేటప్పుడు వేడి తగలడం వల్ల ప్రొటీన్ నిర్మాణం మాత్రమే మారుతుంది.. తప్ప దాని పోషక విలువలు తగ్గవు. నిజానికి, పచ్చి గుడ్డు కంటే వండిన గుడ్డు తిన్నప్పుడే మన శరీరం ప్రొటీన్‌ను సులభంగా గ్రహిస్తుంది. అయితే, ఇక్కడే ఒక మెలిక ఉంది.. అదేంటో ఇప్పుడు చూద్దాం..

వంట పద్ధతి వల్ల ప్రొటీన్ పరిమాణం మారుతుందా?

న్యూట్రిషన్ నిపుణుల ప్రకారం.. గుడ్డును ఏ పద్ధతిలో వండినా దానిలోని ప్రొటీన్ పరిమాణంలో పెద్దగా మార్పు ఉండదు. ఒక పెద్ద పచ్చి గుడ్డులో ఎంత ప్రొటీన్ (సుమారు 6.3 గ్రాములు) ఉంటుందో, దాన్ని ఉడకబెట్టినా లేదా ఫ్రై చేసినా అంతే ప్రొటీన్ లభిస్తుంది. వంట చేసే సమయంలో మనం వాడే నూనె, వెన్న, లేదా పాలు వంటి అదనపు పదార్థాల వల్ల క్యాలరీలలో తేడా రావచ్చు తప్ప, గుడ్డులోని సహజ ప్రొటీన్ తగ్గదు. వేడి తగలడం వల్ల ప్రొటీన్ అణువుల నిర్మాణం మారుతుంది తప్ప ప్రొటీన్ నశించదు.

వండిన గుడ్ల వల్ల కలిగే ప్రయోజనం:

పచ్చి గుడ్లతో పోలిస్తే, వండిన గుడ్ల నుండి మన శరీరం ప్రొటీన్‌ను చాలా వేగంగా, సమర్థవంతంగా గ్రహిస్తుంది. గుడ్డును వేడి చేసినప్పుడు దానిలోని ప్రొటీన్ నిర్మాణం విడిపోయి, మన జీర్ణ ఎంజైమ్‌లు దాన్ని సులభంగా జీర్ణం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. అంతేకాకుండా, వండటం వల్ల గుడ్డులో ఉండే హానికర బ్యాక్టీరియా నశించి ఆరోగ్యానికి సురక్షితంగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

ఏ పద్ధతి అత్యుత్తమమైనది?

మితిమీరిన వేడి లేదా నూనెలో తీవ్రంగా వేయించడం వల్ల అమినో ఆమ్లాలు కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల, మితమైన వేడితో ఉడకబెట్టడం లేదా హాఫ్ బాయిల్/పోచింగ్ చేయడం అత్యుత్తమ పద్ధతులుగా నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ప్రొటీన్ సులభంగా జీర్ణమవడానికి సహాయపడటమే కాకుండా అదనపు క్యాలరీలు లేకుండా శరీరానికి పూర్తి పోషణను అందిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..
రెండు జ్యోతిర్లింగాలతో పాటు దక్షిణ భారత పుణ్యక్షేత్రాల సందర్శన..
రెండు జ్యోతిర్లింగాలతో పాటు దక్షిణ భారత పుణ్యక్షేత్రాల సందర్శన..
సూర్యాస్తమయం తర్వాత ఈ 5 వస్తువులు అస్సలు కొనకూడదు! కారణం తెలిస్తే
సూర్యాస్తమయం తర్వాత ఈ 5 వస్తువులు అస్సలు కొనకూడదు! కారణం తెలిస్తే
షేర్ మార్కెట్లో లాభాలు కొందరికే ఎందుకు? నష్టాల వెనుక అసలు రహస్యం
షేర్ మార్కెట్లో లాభాలు కొందరికే ఎందుకు? నష్టాల వెనుక అసలు రహస్యం