Box Office Movies: ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు.. రణబాలి నుంచి గరివిడి లక్ష్మి వరకు..
ఈ వారం థియేటర్లలో సినిమాల జాతర మొదలవుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ మాస్ ఎంటర్‌టైనర్ 'జైలర్ 2', విజయ్ దేవరకొండ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడిక్ డ్రామా 'రణబాలి', గ్రామీణ నేపథ్య చిత్రం 'గరివిడి లక్ష్మి'తో పాటు మరికొన్ని ఆసక్తికర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ ఏఏ సినిమాలు రిలీజ్ కానున్నాయో తెలుసుకుందామా.

దసరా పండుగ సీజన్ వచ్చేసింది. అయితే ఈ వారం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల నుంచి పెద్ద చిత్రాల వరకు జోరు జాతర ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ వారం కూడా సినీ ప్రేక్షకులను అలరించడానికి విభిన్న రకాల చిత్రాలు థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే టీజర్స్, ట్రైలర్, పోస్టర్స్ ద్వారా అంచనాలు పెంచేసిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్లు, క్రైమ్ థ్రిల్లర్లు, గ్రామీణ నేపథ్య కథలతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొననుంది. మరి ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్న ఆ విశేష చిత్రాలపై ఒక లుక్కేద్దాం. ఈ వారం రిలీజెస్ లో అత్యంత భారీ అంచనాలు ఉన్న చిత్రం సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ కల్ట్ క్లాసిక్ సీక్వెల్, ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 15న భారీ స్థాయిలో విడుదలవుతోంది. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి వంటి దిగ్గజ తారల గెస్ట్ రోల్స్ , అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ సినిమాపై రేంజ్‌ను పెంచేశాయి.
ఎక్కువమంది చదివినవి: Bathukamma Song : యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న మంగ్లీ కొత్త బతుకమ్మ పాట.. గంటల్లోనే
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ . ఈ సినిమా కూడా ఈ వారం థియేటర్లలోకి రాబోతోంది. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న రిలీజ్ చేయనున్నారు.
ఎక్కువమంది చదివినవి: Jaya Prada: ఆ హీరోకు అత్తగా నటించా.. అతడు అంటే నాకు పిచ్చి ఇష్టం.. జయప్రద..
అలాగే అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ జంటగా నటించిచన క్రేజీ కళ్యాణం చిత్రాన్ని సైతం అక్టోబర్ 16న రిలీజ్ చేస్తున్నారు. వీటితోపాటు ఆనంది, రాగ్ మయూర్ జంటగా నటించిన గరివిడి లక్ష్మీ చిత్రాన్ని సైతం అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఎల్‌బీ శ్రీరామ్, అవసరాల శ్రీనివాస్, అంకిత్ కోయ్య, షకలక శంకర్, శరణ్య ప్రదీప్, కంచరపాలెం కిశోర్, నితిన్ ప్రసన్న, వైవా రాఘవ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాను అక్టోబర్ 17న విడుదల చేస్తున్నారు. సిద్ధి ఇదానీ, అంజలి నాయర్, దేవదర్శిని కీలకపాత్రల్లో నటించిన మూవీ డ్రోన్స్. ఈ సినిమాను అక్టోబర్ 16న తమిళంలో విడుదల చేస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి: Nana Patekar : నా ఆస్తి ఆ 12 ఎండు కట్టలే.. నేను ముందే పక్కన పెట్టుకున్నా.. నానా పటేకర్ వీడియో షేర్ చేసిన ఆర్జీవీ..
ఎక్కువమంది చదివినవి: Srikanth: ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్ పర్సన్.. నటనలో మా ఇద్దరికీ పోటీ ఉండేది.. హీరో శ్రీకాంత్..
