AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యాచీగా ‘మహర్షి’ మూడో పాట

సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ మూవీ నుంచి మూడో పాట వచ్చింది. ‘ఎవరెస్ట్ అంచునా’ అంటూ సాగే మూడో పాటను మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. వినడానికి క్యాచీగా ఉన్న ఆ పాటకు శ్రీమణి అందించిన సాహిత్యం బావుంది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మరీ కొత్తగా లేనప్పటికీ.. ఫర్వాలేదనిపిస్తోంది. ఇక ఈ పాటలో మహేశ్ ఎప్పటిలాగే అందంగా కనిపించగా.. పూజా హెగ్డే తన అందంతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కాగా […]

క్యాచీగా ‘మహర్షి’ మూడో పాట
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 19, 2019 | 4:36 PM

Share

సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ మూవీ నుంచి మూడో పాట వచ్చింది. ‘ఎవరెస్ట్ అంచునా’ అంటూ సాగే మూడో పాటను మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. వినడానికి క్యాచీగా ఉన్న ఆ పాటకు శ్రీమణి అందించిన సాహిత్యం బావుంది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మరీ కొత్తగా లేనప్పటికీ.. ఫర్వాలేదనిపిస్తోంది. ఇక ఈ పాటలో మహేశ్ ఎప్పటిలాగే అందంగా కనిపించగా.. పూజా హెగ్డే తన అందంతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

కాగా మహేశ్ బాబు ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీలో అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రం మే9న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Follow Us