AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దొరబాబు ఫోన్‌ కాల్‌కి దిమ్మతిరిగే రియాక్షన్ ఇచ్చిన రోజా!

తనను పట్టుకున్న పోలీసులతో.. రోజాకి కాల్ చేయించాడట దొరబాబు. అయితే రోజా సమాధానం విని దొరబాబు దిమ్మ తిరిగిపోయిందట. 'నేను ఒక బాధ్యతగల మహిళ అని..

దొరబాబు ఫోన్‌ కాల్‌కి దిమ్మతిరిగే రియాక్షన్ ఇచ్చిన రోజా!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 08, 2020 | 10:38 AM

Share

జబర్దస్త్ దొరబాబు వ్యవహారం గత కొద్ది రోజులుగా.. సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. సెక్స్ రాకెట్ ఉదంతంలో జబర్దస్త్ కమెడియన్స్ దొరబాబుతో పాటు పరదేశీ కూడా పోలీసులకి దొరికిపోయారు. ఈ నేపథ్యంలో వీరిపై జబర్దస్త్ టీంతో పాటు కమెడియన్ ఆది సీరియస్ అయినట్టు సమాచారం. అలాగే ఈ వారం వచ్చే ఆది స్కిట్‌లో కూడా వారు కనిపించలేదు.

ఇప్పుడు ఈ వివాదంతో.. దొరబాబు పరువే కాకుండా.. జబర్దస్త్ పరువు కూడా పోయింది. అందులో ఉన్నవాళ్లందరూ అలాంటి వాళ్లేనా.. అనే డౌట్ కూడా క్రియేట్ అయింది. అయితే.. ఇంత రాద్ధాంతం జరుగుతున్నా.. జడ్జి రోజా ఇన్వాల్వ్ అవకుండా ఉంటారా? అనే డౌట్.. అన్ని వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.అవును.. రోజా జబర్దస్త్ జడ్జిమాత్రమే కాకుండా.. వైసీపీ ఎమ్మెల్యే కూడా. నిజానికి ఆమె ఒక్క ఫోన్ కొడితే.. పని అయిపోతుంది. అంత ఇమేజ్ రోజా సొంతం.

మరి ఎమ్మెల్యే రోజాకి ఫోన్ చేయాలనే ఆలోచన దొరబాబుకి రాకుండా ఉంటుందా? వచ్చింది.. ఆ ప్రయత్నం కూడా అయిందట. తనను పట్టుకున్న పోలీసులతో.. రోజాకి కాల్ చేయించాడట దొరబాబు. అయితే రోజా సమాధానం విని దొరబాబు దిమ్మ తిరిగిపోయిందట. ‘నేను ఒక బాధ్యతగల మహిళ అని.. ఇలాంటి వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనని, మీ డ్యూటీ మీరు చేయండంటూ’ ఆమె పోలీసులకు సమాధానమిచ్చారట. అయితే.. ఈ వార్త నిజమో కాదో… తెలీదు కానీ.. ప్రస్తుతం దొరబాబుకి సంబంధించిన కొన్ని వార్తలు మాత్రం బాగా వైరల్ అవుతోన్నాయి.

కాగా ఇదే వ్యవహారంలో మరో కొన్ని కూడా వినిపిస్తున్నాయి. రోజా ఇలాంటి ఆన్సర్ వస్తుందనే.. ముందే భయపడి దొరబాబు ఫోన్ చేయలేదనే గాసిప్స్ కూడా వస్తున్నాయి. ఏదేమైనా.. ఇప్పుడు దొరబాబు, పరదేశీ చేసిన పనులకు.. వారి జీవితమంతా బాధపడాల్సిందే.

Read More: ఫ్లూ అటాక్.. 13 వేల కోళ్లను చంపేయాలని నిర్ణయం

Follow Us