AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెరీర్‌లో తొలిసారి రిస్క్ చేస్తోన్న చరణ్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్‌’ లో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత అతడు ఏ సినిమా చేయబోతున్నాడనే డౌట్ ఫ్యాన్స్‌లో ఆతృత నెలకొల్పింది. ఇప్పటికే ఎందరో డైరెక్టర్లు చెర్రీకి కథలు వినిపించినా, అవి ఆయన్ను అంతగా ఇంప్రెస్ చెయ్యలేదని టాక్. ఈ లిస్ట్‌లో జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి, సాహో ఫేమ్ సుజీత్ కూడా ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంట్రస్టింగ్ అబ్డేట్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రదీప్ అనే వ్యక్తి […]

కెరీర్‌లో తొలిసారి రిస్క్ చేస్తోన్న చరణ్..!
Ram Naramaneni
|

Updated on: Mar 07, 2020 | 10:40 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్‌’ లో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత అతడు ఏ సినిమా చేయబోతున్నాడనే డౌట్ ఫ్యాన్స్‌లో ఆతృత నెలకొల్పింది. ఇప్పటికే ఎందరో డైరెక్టర్లు చెర్రీకి కథలు వినిపించినా, అవి ఆయన్ను అంతగా ఇంప్రెస్ చెయ్యలేదని టాక్. ఈ లిస్ట్‌లో జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి, సాహో ఫేమ్ సుజీత్ కూడా ఉన్నారు.

అయితే తాజాగా ఓ ఇంట్రస్టింగ్ అబ్డేట్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రదీప్ అనే వ్యక్తి చెర్రీ దగ్గరకి ఓ స్క్రిప్ట్‌తో వెళ్లాడట. అతడు నేరేషన్ ఇవ్వగానే చరణ్ తెగ ఎగ్జైట్ అయ్యాడట. ఆ వెంటనే చిరంజీవికి కూడా కథ వినిపించడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇంత మంది దర్శకులను కాదని, చరణ్ కొత్త వ్యక్తికి ఆఫర్ ఇచ్చాడనే వార్త ఇండస్ట్రీలో దారాళంగా వ్యాపిస్తోంది. ఇదే నిజమైతే చెర్రీ తొలిసారి ఓ కొత్త డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది.  దీనిపై అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది. కాగా చరణ్ మరో నిర్మాతగా కూడా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. కొరటాల-చిరు కాంబోలో వస్తోన్న మూవీకి ఆయన నిర్మాతగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే.

Follow Us