Jabardasth: హైపర్ ఆది సంచలన నిర్ణయం.. జబర్దస్త్ నుంచి దొరబాబు, పరదేశీలు ఔట్.?

Jabardasth Dorababu Incident: జీవితంలో మంచిపేరు సంపాదించుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అదే చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఒక్క తప్పు చేస్తే చాలు.. అప్పటివరకు సంపాదించి పెట్టుకున్న పేరు కాస్తా తలక్రిందులు అయిపోతుంది. ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కుంటున్నారు జబర్దస్త్ ఆర్టిస్టులు దొరబాబు, పరదేశీలు. జబర్దస్త్‌లో తమ నవ్వులతో ప్రేక్షకులను అలరిస్తున్న వీళ్లు మూడు రోజుల కిందట వైజాగ్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ […]

Jabardasth: హైపర్ ఆది సంచలన నిర్ణయం.. జబర్దస్త్ నుంచి దొరబాబు, పరదేశీలు ఔట్.?
Ravi Kiran

|

Mar 07, 2020 | 2:05 PM

Jabardasth Dorababu Incident: జీవితంలో మంచిపేరు సంపాదించుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అదే చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఒక్క తప్పు చేస్తే చాలు.. అప్పటివరకు సంపాదించి పెట్టుకున్న పేరు కాస్తా తలక్రిందులు అయిపోతుంది. ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కుంటున్నారు జబర్దస్త్ ఆర్టిస్టులు దొరబాబు, పరదేశీలు.

జబర్దస్త్‌లో తమ నవ్వులతో ప్రేక్షకులను అలరిస్తున్న వీళ్లు మూడు రోజుల కిందట వైజాగ్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ అయింది. ఆ సంఘటన జరగకముందు వారికి ఉన్న ఫేమ్‌ను.. ఈ ఇన్సిడెంట్‌తో పూర్తిగా కోల్పోయారు.

ఇక జబర్దస్త్‌లో హైపర్ ఆది టీమ్‌లో ఉండే ఈ ఇద్దరూ ఇకపై ఆ షోలో కొనసాగుతారా లేదా అన్నది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. మల్లెమాల ప్రొడక్షన్స్ యాజమాన్యం ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించినా.. వాళ్లు మాత్రం నిజానికి చాలా మంచివాళ్లని సర్టిఫికెట్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. అటు తుది నిర్ణయాన్ని కూడా ఆదికే వదిలేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే ఆది వీరిద్దరిపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు నెట్టింట్లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ప్రస్తుతానికి దొరబాబు, పరదేశీలకు జబర్దస్త్ నుంచి బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం. అందుకే ఇటీవల విడుదలైన ప్రోమోలో కూడా వాళ్లు కనిపించలేదు. అయితే టీమ్ నుంచి తీసేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం ఎంత ఉందో ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ఈ బ్రేక్ తాత్కాలికమో.. లేక పూర్తిగానా అనే దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

For More News: 

టీవీ వీక్షకులకు గుడ్ న్యూస్..

బాన్సువాడలో దారుణం.. ముగ్గురు కూతుళ్లను హత్య చేసిన తండ్రి..

‘ఎస్ బ్యాంక్’ దెబ్బ.. వినియోగదారులకు షాకిచ్చిన ఫోన్‌పే…

ఆడబిడ్డకు జన్మనిచ్చిన దిశ నిందితుడి భార్య…

మోదీ సర్కార్ సంచలనం.. ఆ రెండు ఛానళ్ల‌పై నిషేధం…

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. నోటిఫికేషన్ విడుదల

బిగ్ బ్రేకింగ్: ఏపీలో పదో తరగతి పరీక్షలకు కొత్త షెడ్యూల్

తిరుమలలో అపచారం.. వెంకన్న సాక్షిగా వాళ్లు ఏం చేశారంటే..?

విజయ్ దేవరకొండ హీరోయిన్ ఎగ్ దోశలు.. వీడియో వైరల్..

సఫారీ సిరీస్… పగ్గాలు చేపట్టనున్న హిట్‌మ్యాన్.. హార్దిక్, ధావన్‌ల రీ-ఎంట్రీ ఖరారు.!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu