‘అసురన్’ రీమేక్..వెంకీ పక్కా స్కెచ్..డీటేల్స్ తెలిస్తే షాక్..

'అసురన్' రీమేక్..వెంకీ పక్కా స్కెచ్..డీటేల్స్ తెలిస్తే షాక్..

‘అసురన్’ రీమేక్‌తో దగ్గుబాటి ఫ్యామిలీ సంచలనాలు క్రియేట్ చేయడానికి రెడీ అయినట్టే కనిపిస్తోంది. ఫ్యామిలీ చిత్రాల హీరో వెంకీ ఈ మూవీని రీమేక్ కోసం సెలెక్ట్ చేసుకోవడమే ఓ బ్రేకింగ్ న్యూస్. దానికి పక్కా ఫ్యామిలీ చిత్రాలు తీసే శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు అని ప్రకటించి మరో బాంబ్ పేల్చారు. అసలు శ్రీకాంత్ ఇప్పటివరకు తీసిన మూవీస్‌…కొత్త బంగారులోకం, ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం. వీటిలో ఒక్క సినిమాలో కూడా మినిమమ్ వైలెన్స్ ఉండదు. […]

Ram Naramaneni

|

Dec 06, 2019 | 8:41 PM

‘అసురన్’ రీమేక్‌తో దగ్గుబాటి ఫ్యామిలీ సంచలనాలు క్రియేట్ చేయడానికి రెడీ అయినట్టే కనిపిస్తోంది. ఫ్యామిలీ చిత్రాల హీరో వెంకీ ఈ మూవీని రీమేక్ కోసం సెలెక్ట్ చేసుకోవడమే ఓ బ్రేకింగ్ న్యూస్. దానికి పక్కా ఫ్యామిలీ చిత్రాలు తీసే శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు అని ప్రకటించి మరో బాంబ్ పేల్చారు. అసలు శ్రీకాంత్ ఇప్పటివరకు తీసిన మూవీస్‌…కొత్త బంగారులోకం, ముకుంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం. వీటిలో ఒక్క సినిమాలో కూడా మినిమమ్ వైలెన్స్ ఉండదు. కానీ వెంకీ అండ్ ప్రొడ్యూసర్ సురేశ్ బాబు..అతని చేతిలోనే ప్రాజెక్ట్ పెట్టేశారు.

ఇది పక్కనపెడదాం. ఇటీవలే మూవీకి సంబంధించి మరో అప్డేట్ బయటకు వచ్చింది. దగ్గుబాటి సురేశ్ బాబు చిన్నకొడుకు అభిరామ్ అందరికి సుపరిచితుడే. శ్రీ రెడ్డి ఎపిసోడ్‌తో ఇతగాడి పేరు మారుమోగిపోయింది. దాంతో హీరో ఎంట్రీ ఇవ్వాల్సిన కుర్రోడు కాస్తా చాలా రోజులు సైలెంటయ్యాడు. తాజాగా అసురన్ రీమేక్‌లో లీడ్ క్యారక్టర్ పెద్ద కొడుకు పాత్ర కోసం అభిరామ్‌ని పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ రాకముందే మరో న్యూస్ ఫిల్మ్ నగర్‌లో చెక్కర్లు కొడుతోంది. వెంకటేశ్ తనయుడు అర్జున్‌ని..సినిమాలో లీడ్ క్యారెక్టర్ రెండో పాత్రలో నటింపజేయాలని మూవీ యూనిట్ భావిస్తోందట. వెంకటేశ్ తనయుడు గోపాల..గోపాల సినిమాలో గతంలో నటించిన విషయం అందరికి విధితమే. ఇప్పుడు వచ్చిన సమాచారం కరెక్ట్ అయితే సినిమాలో వెంకటేశ్ పెద్ద కొడుకు పాత్రలో అభిరామ్, చిన్న కొడుకు పాత్రలో అర్జున్ కనిపిస్తారు. మరి ఈ న్యూస్‌లో నిజమెంతో తెలియాలంటే మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu