Actress Dhivya: ప్రేమవివాహం చేసుకున్న నటీనటులు.. భర్త మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్..

|

Oct 07, 2022 | 12:02 PM

కాంచీపురంలోని ఓ ఆలయంలో మళ్లీ హిందూ సంప్రదాయాలను అనుసరించి పెళ్లి చేసుకున్నారు.

Actress Dhivya: ప్రేమవివాహం చేసుకున్న నటీనటులు.. భర్త మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్..
Divya Arnav
Follow us on

తన భర్త తనను మోసం చేశాడని పోలీసులను ఆశ్రయించింది సీరియల్ నటి దివ్య శ్రీధర్. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. ప్రస్తుతం తాను గర్భవతి అని..దీంతో తనను కాదని మరో నటితో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సన్ టీవీలో ప్రసారమైన సెవ్వంధీ సీరియల్‏లో ప్రధాన పాత్రలో నటించి గుర్తింపు పొందింది. అయితే 2017లో కేలడి కన్మణి సీరియల్‏లో నటించిన తన సహా నటుడు ఆర్నవ్‏తో ప్రేమలో పడింది. వీరిద్దరు కొద్ది రోజులు రిలేషన్‏షిప్‏లో ఉన్నారు.

అయితే ఆర్నవ్ అసలు పేరు మహమ్మద్. దివ్యను పెళ్లి చేసుకోవాలంటే ఆమె మతం మారాల్సి ఉంటుందని అతను చెప్పడంతో దివ్య ముస్లింగా మారింది. ఆ తర్వాత వీరు ఇస్లాం మతాచారల ప్రకారం పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తమ వివాహం గురించి అధికారికంగా ప్రకటించవద్దని ఆర్నవ్ కోరినట్లుగా సమాచారం. అదే సమయంలో అతను మరో నటితో ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న దివ్యను అతడిని తనను బహిరంగంగా పెళ్లి చేసుకోవాలని కోరడంతో.. కాంచీపురంలోని ఓ ఆలయంలో మళ్లీ హిందూ సంప్రదాయాలను అనుసరించి పెళ్లి చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

తాను గర్భవతి అయిన తర్వాత తన భర్త వదిలిపెట్టాడని.. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు దివ్య తెలిపింది. తనకు లేదా తనకు పుట్టబోయే బిడ్డకు ఏదైనా చెడు జరిగితే ఆర్నవ్‏దే బాధ్యత అని ఫిర్యాదులో పేర్కొంది. ఆర్నవ్ చెప్పడంతో తనకు అబార్షన్ చేయడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారని.. తనకు న్యాయం చేయడానికి కమిషనర్‏ను ఆశ్రయించనున్నట్లు దివ్య తరపు న్యాయవాది తెలిపారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.