Bigg Boss Telugu 9: 100కు పైగా సినిమాలు.. సడెన్ గా ఇండస్ట్రీకి దూరం.. ఇప్పుడు బిగ్ బాస్‌లోకి స్టార్ కమెడియన్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు ముహూర్తం ముంచుకొస్తోంది. ఆదివారం (సెప్టెంబర్ 07న) బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంఛింగ్ ఉండనుంది. అయితే గతంలో కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన ప్రముఖ నటుడు ఈసారి హౌస్ లోకి కంటెస్టెంట్ అడుగు పెట్టనున్నాడని తెలుస్తోంది.

Bigg Boss Telugu 9: 100కు పైగా సినిమాలు.. సడెన్ గా ఇండస్ట్రీకి దూరం.. ఇప్పుడు బిగ్ బాస్‌లోకి స్టార్ కమెడియన్
Bigg Boss Telugu 9

Updated on: Sep 04, 2025 | 7:10 PM

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కోసం ఆడియెన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత సీజన్ల కంటే ఈసారి షోలో కొత్త రూల్స్, గేమ్స్, టాస్కులు ఉండనున్నట్లు తెలుస్తోది. అందుకు తగ్గట్టుగానే ‘సిలబస్ మార్చేశాం’, ‘డబుల్ హౌస్’ అంటూ హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ కొత్త సీజన్ పై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం (సెప్టెంబర్ 07) గ్రాండ్ గా లాంఛ్ అవుతోంది. ఈసారి కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో బిగ్ బాస్ టీమ్ వినూత్నంగా ఆలోచించింది. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు హౌస్ లో అవకాశం కల్పిస్తోంది. అందుకోసమే అగ్ని పరీక్ష అంటూ సరికొత్త కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇక సెలబ్రిటీల విషయంలో చాలా కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ప్రముఖ నటి ఫ్లోరా సైని అలియాస్ ఆశా సైని, ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, సీరియల్ నటి నవ్య స్వామి, ఎమ్మాన్యుయేల్, కావ్య శ్రీ, రీతూ చౌదరి ఇలా చాలామంది స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల లిస్టులో టాలీవుడ్ కామెడియన్ పేరు కూడా వినిపిస్తోంది. 100కు పైగా సినిమాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడీ యాక్టర్. అయితే ఉన్నట్లుండి సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఈ క్రమంలో ఇప్పుడు బిగ్ బాస్ షోలో సత్తా చాటి నటుడిగా మళ్లీ బిజీ అవుదామనుకుంటున్నాడు. అతను మరెవరో కాదు సుమన్ శెట్టి.

దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు సుమన్ శెట్టి. మొదటి సినిమాలోనే తన యాక్టింగ్ తో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. తన కామెడీ టైమింగ్‌తో ఏకంగా నంది అవార్డు కూడా అందుకున్నాడు. జయం తర్వాత ఆ తర్వాత బెండు అప్పారావ్ ఆర్ఎంపీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, యజ్ఞం, సంబరం, రణం, సంక్రాంతి, హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, 7/జి బృందావన్ కాలనీ, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ తదితర సినిమాల్లో నటించాడు.

ఇవి కూడా చదవండి

సుమన్ శెట్టి లేటెస్ట్ ఫొటోస్..

అయితే ఉన్నట్లుండి సినిమాలకు దూరమైన ఈ నటుడు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోలో సత్తా చాటి మళ్లీ నటుడిగా బిజీ అవుదామనుకుంటున్నాడు సుమన్ శెట్టి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.