AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్.. ఇన్‌స్టాలో పరిచయమైన అమ్మాయిని ఇంటికి పిలిపించి ఘోరం.. ప్రముఖ నటుడి అరెస్ట్

షాకింగ్.. ఓ ప్రముఖ నటుడిపై వస్తోన్న ఆరోపణలు సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. ఆ నటుడు కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు ఎట్టకేలకు గురువారం (సెప్టెంబర్ 04) అరెస్టు చేశారు. విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

షాకింగ్.. ఇన్‌స్టాలో పరిచయమైన అమ్మాయిని ఇంటికి పిలిపించి ఘోరం.. ప్రముఖ నటుడి అరెస్ట్
Bollywood TV Actor Ashish Kapoor
Basha Shek
|

Updated on: Sep 04, 2025 | 8:53 PM

Share

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన అమ్మాయిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడనే ఆరోపణలపై ప్రముఖ టీవీ నటుడు ఆశిష్ కపూర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ప్రకారం ఆశిష్ తన ఇంట్లో నిర్వహించిన ఒక ప్రైవేట్ పార్టీలో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. బాత్రూమ్ లో బాధితురాలిపై ఆత్యాచారం చేశాడని అమ్మాయి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆశిష్ ఇతర నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇతర వివరాల్లోకి వెళితే.. బాధితురాలు, ఆశిష్ కపూర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒకరికి ఒకరు పరిచయమయ్యారు. కొద్ది రోజులయ్యాక ఈ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఇదే క్రమంలో ఆశిష్ ఆ అమ్మాయిని తన హౌస్ పార్టీకి ఆహ్వానించాడు. అక్కడ బాత్రూమ్ లో అఅమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేకాదు దీనిని వీడియో షూట్ కూడా చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. అయితే, పోలీసులు తమ దర్యాప్తులో ఇంకా ఎటువంటి వీడియో కనుక్కోలేదని చెబుతున్నారు. ఈ కేసులో అశిష్ స్నేహితుడు, అతని స్నేహితుని భార్య, మరో ఇద్దరు వ్యక్తులపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కాగా ఈ పార్టీలో తనకు ఇచ్చిన డ్రింక్స్ లో ఆశిష్ ఏదో కలిపాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియో లీక్ చేస్తానని ఆశిష్ బెదిరించాడని కూడా ఆమె ఆరోపించింది.. ఈ సంఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.

40 ఏళ్ల ఆశిష్ కపూర్ ‘ష్ష్ష్… ఫిర్ కోయి హై’, ‘ససురల్ సిమర్ కా 2’, ‘యే రిష్ట క్యా కెహ్లతా హై’, ‘సాత్ ఫెరే.. సలోనీ కా సఫర్’, ‘సరస్వతీచంద్ర’, ‘మోల్కీ- రిష్టోన్ కి అగ్ని పరీక్ష’ వంటి ప్రముఖ సీరియల్స్‌లో నటించాడు. ముఖ్యంగా ‘దేఖా ఏక్ ఖ్వాబ్’లో ఉదయ్ పాత్రను ఆశిష్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

ఆశిష్ గతంలో కూడా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తల్లో నిలిచాడు. ‘దేఖా ఏక్ ఖ్వాబ్’ సీరియల్‌లో అతనితో కలిసి నటించిన ప్రియల్ గోర్‌తో ప్రేమ వ్యవహారం నడిపాడని ప్రచారంలో ఉంది. అయితే ఈ సీరియల్ ముగిసిన వెంటనే వారిద్దరి బంధం కూడా బీటలు వారిందని టాక్. దీని తర్వాత ఆశిష్ నిర్మాత పెర్ల్ గ్రేతో డేటింగ్ చేశాడు మరియు. ఏప్రిల్ 2021లో నిశ్చితార్థంకూడా చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకు ఆమెతోనూ విడిపోయాడు. వీరి తర్వాత యూరోపియన్ మహిళ ఇడా క్రోనీతో కూడా ఆశిష్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతలోనే ఇప్పుడు అతనిపై ఆత్యాచార ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ సినిమాతో నా జీవితమే మారిపోయింది.. నటుడు జయప్రకాష్ రెడ్డి..
ఆ సినిమాతో నా జీవితమే మారిపోయింది.. నటుడు జయప్రకాష్ రెడ్డి..
జాబిల్లి చెంతకు 'ఆర్టెమిస్-2' వ్యోమగాములతో పాటు చిన్నారి 'బొమ్మ'
జాబిల్లి చెంతకు 'ఆర్టెమిస్-2' వ్యోమగాములతో పాటు చిన్నారి 'బొమ్మ'
ఫ్యాన్స్‌ అంటూ వచ్చి.. రాళ్లతో కొట్టి.. కొమురక్కపై దాడి
ఫ్యాన్స్‌ అంటూ వచ్చి.. రాళ్లతో కొట్టి.. కొమురక్కపై దాడి
నెటిజన్‌ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్
నెటిజన్‌ తప్పుడు ప్రశ్నకు.. లైవ్‌లోనే చెప్పు చూపించిన హీరోయిన్
సామాన్యుడిపై 'మీ సేవ' భారం.. 50% చార్జీలు పెంపు
సామాన్యుడిపై 'మీ సేవ' భారం.. 50% చార్జీలు పెంపు
ధురంధర్‌2ను తట్టుకుని.. దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ
ధురంధర్‌2ను తట్టుకుని.. దూసుకుపోతున్న హాలీవుడ్ మూవీ
ఈ గింజలను పారేస్తే ఈ భారీ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టే..
ఈ గింజలను పారేస్తే ఈ భారీ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టే..
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ శోభా శెట్టి.. వీడియో
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ శోభా శెట్టి.. వీడియో
నిమ్మకాయలు గుత్తులు గుత్తులుగా కాయాలంటే.. జస్ట్ ఇలా చేయండి చాలు..
నిమ్మకాయలు గుత్తులు గుత్తులుగా కాయాలంటే.. జస్ట్ ఇలా చేయండి చాలు..
తల్లికి వందనం కింద ఒకేసారి అకౌంట్లోకి రూ.15 వేలు.. డేట్ ఫిక్స్
తల్లికి వందనం కింద ఒకేసారి అకౌంట్లోకి రూ.15 వేలు.. డేట్ ఫిక్స్