
తెలుగుతో పాటు అన్ని ప్రముఖ భాషల్లోనూ మళ్లీ బిగ్ బాస్ సందడి ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రోమోలు, గ్లింప్స్ లతో షోపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ విషయానికి వస్తే.. ఇప్పటికే ఎనిమిది సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యాయి. తొమ్మిదో సీజన్ కోసం బుల్లితెర అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పటిలాగే గత సీజన్ల కంటే ఈసారి మరిన్ని హంగులు, సర్ ప్రైజింగ్ రూల్స్ అండ్ టాస్క్ లు ఉండనున్నట్లు సమాచారం. అలాగే కంటెస్టెంట్ల కోసం ఎంపిక ప్రక్రియ దాదాపు తుది దశకు వచ్చిందని టాక్. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, ఫేమస్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల తో పాటు కామన్ మ్యాన్ లు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల బిగ్ బాస్ సీజన్ 9 కామన్ మ్యాన్ కంటెస్టెంట్‌కి సంబంధించి ఒక ప్రోమోను రిలీజ్ చేశారు. సుమారు 35 సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రోమోకు ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఎంతో మంది నుంచి 40 మందిని సెలెక్ట్ చేశాం. ఇప్పుడు మొదలౌతుంది అసలైన పరీక్ష. దాన్ని దాటుకుని బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లోకి ఎవరు వెళ్తారో.. చూద్దాం’ అని నాగార్జున ఈ ప్రోమోలో చెప్పుకొచ్చారు.
అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ 40 మంది పేరుకి మాత్రమే కామన్‌మ్యాన్ కానీ. వీళ్లంతా ప్రముఖ సెలబ్రిటీలేనని తెలుస్తోంది. ఫేమస్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు ఈ ప్రోమోలో కనిపిస్తున్నారని నెటిజన్లు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇందులో ఒక టాలీవుడ్ హీరోయిన్ పేరు కూడా ఉందని తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు రేఖా భోజ్. వైజాగ్ కు చెందిన ఈ బ్యూటీ గతంలో దామిని విల్లా, రంగేలా, కళ్యాణ తస్మై నమహ: తదితర చిత్రాల్లో నటించింది. ఎక్కువగా బోల్డ్ పాత్రలతోనే ఫేమస్ అయ్యింది.
ఇక రేఖా భోజ్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే పిచ్చి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున కూడా ప్రచారం చేసింది. నిజం చెప్పుకోవాలంటే.. గత సీజన్‌లోనే రేఖ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాల్సింది. అయితే కొన్ని కారణాలతో ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో రేఖ ఎంట్రీ పక్కాగా ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన బిగ్ బాస్ సీజన్ కామన్ మ్యాన్ కంటెస్టెంట్ ప్రోమోలోనూ రేఖ కనిపించిందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.