ఉదయ్ బయోపిక్‌పై సందీప్ సంచలన ప్రకటన

ఒకప్పటి టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్‌ రాబోతుందంటూ కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంట్లో హీరో సందీప్ కిషన్ హీరోగా నటించబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. దీనిపై సందీప్ క్లారిటీ ఇచ్చాడు. తనకు బయోపిక్స్‌పై ఇంట్రస్ట్ లేదని తేల్చి చెప్పాడు. ఉదయ్ కిరణ్ బయోపిక్‌కి సంబంధించి తనను ఎవరూ సంప్రదించలేదని..మీడియాలో వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని పేర్కొన్నాడు. Numerous rumours are being heard about Uday Kiran’s biopic in […]

ఉదయ్ బయోపిక్‌పై సందీప్ సంచలన ప్రకటన
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Nov 27, 2019 | 2:45 PM

ఒకప్పటి టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్‌ రాబోతుందంటూ కొన్ని రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంట్లో హీరో సందీప్ కిషన్ హీరోగా నటించబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. దీనిపై సందీప్ క్లారిటీ ఇచ్చాడు. తనకు బయోపిక్స్‌పై ఇంట్రస్ట్ లేదని తేల్చి చెప్పాడు. ఉదయ్ కిరణ్ బయోపిక్‌కి సంబంధించి తనను ఎవరూ సంప్రదించలేదని..మీడియాలో వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని పేర్కొన్నాడు.

ఉదయ్ మరణానంతరం నుంచి అతని బయోపిక్‌పై ప్రచారం సాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో బయోపిక్స్ ట్రెండ్ పెరగడంతో..దీనికి బజ్ మరింత పెరిగింది. ఉదయ్ ఎగిసిపడిన కెరటం. అతడు ఎంత త్వరగా స్టార్ ఇమేజ్ సంపాదించాడో, అంతే త్వరగా దాన్ని పోగొట్టుకున్నాడు. వృత్తిపరంగానే కాకుండా పర్సనల్‌గా కూడా ఉదయ్‌కు అనేక ఆటుపోట్లు ఎదురయ్యాయి. దీంతో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ పెద్ద సినిమా ఫ్యామిలీతో విభేదాలున్నాయన్న ప్రచారం నేపథ్యంలో ఉదయ్ కిరణ్ బయోపిక్‌ పట్టాలెక్కడ లేదని కూడా తెలుస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu