Sudigali Sudheer: కావాలనే నన్ను బ్యాడ్ చేస్తున్నారు.. సుధీర్ షాకింగ్ కామెంట్స్
స్టార్ హీరోలకు ఉండే క్రేజ్ ను ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్ .. ఆతర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకున్నాడు. అలాగే యాంకర్ గా మారి పలు టీవీ షోలను కూడా హోస్ట్ చేశాడు. ఇక హీరోగానూ కొన్ని సినిమాలు చేశాడు.
ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న కామెడీ ఛానెల్ జబర్దస్త్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ ఈ కామెడీ షో టాప్ లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతుంది. కాగా జబర్దస్త్ పుణ్యమా అని చాలా మంది నటులు, దర్శకులు టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కొంతమంది కమెడియన్స్ గా రాణిస్తుండగా.. మరికొంతమంది హీరోలుగా, దర్శకులుగా మారి సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే హైపర్ ఆది కమెడియన్ గా వరుసగా సినిమాల్లో నటిస్తూ నవ్వులు పూయిస్తున్నారు. అలాగే నటుడు వేణు బలగం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. దర్శకుడిగా వేణు తన ప్రతిభ కనబరిచారు. అలాగే సుడిగాలి సుధీర్ హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు సుధీర్.
ఇది కూడా చదవండి : Amrish Puri: అమ్రీష్ పురి మనవడు ఇండస్ట్రీలో స్టార్ హీరో అని మీకు తెలుసా.?
ఆతర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఆతర్వాత హీరోగా మారిపోయాడు. 2017లో నేనోరకం అనే సినిమాతో హీరోగా మారాడు. ఆతర్వాత వరుసగా సాఫ్ట్‌వేర్ సుధీర్, 3 మంకీస్, జ, కోతల రాయుడు, వాంటెడ్ పండుగాడ్, గాలోడు, కాలింగ్ సహశ్ర సినిమాలు చేశాడు. త్వరలోనే గోట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో హాట్ బ్యూటీ దివ్యభారతి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా నుంచి గతంలో ఓ సాంగ్ రిలీజ్ అయ్యింది. అప్పటి నుంచి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు.
ఇది కూడా చదవండి : Mokshagna : ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! మోక్షజ్ఞకు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు..
ఇదిలా ఉంటే ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయిందని, బడ్జెట్ ఎక్కువ కావడంతో నిర్మాత చేతులు ఎత్తేశారని వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు కూడా సైలెంట్ గా సినిమా నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. దాంతో సుధీర్ తిరిగి యాంకర్ గా మారిపోయాడు. బుల్లితెర పై పలు షోలు చేస్తున్నాడు. తాజాగా ఓ షో హోస్ట్ చేస్తున్న సమయంలో సుధీర్ గురించి ఓ పంచ్ వేశారు అందులో . షోలో సుధీర్ ఓ అమ్మాయితో మాట్లాడుతుంటే బ్యాగ్రౌండ్ లో పులిహోర కలపడం అంటూ మ్యూజిక్ వేశారు. దాంతో సుధీర్ హర్ట్ అయ్యాడు. “ఆ అమ్మాయిని ప్రశ్న అడగమన్నది మీరే.. ఆ తరువాత పులిహోర కలుపుతున్నాడు అని బ్యాగ్రౌండ్ లో మ్యూజిక్ వేసింది మీరే.. ఇంత బ్యాడ్ చేయాలనీ చూస్తున్నారురా.. అని సుధీర్ అన్నాడు. అయితే ఇదంతా ఫన్నీగానే అన్నాడు సుధీర్. నిజానికి సుధీర్ పై ఎన్ని కామెడీలు చేసిన అతను లైట్ తీసుకుంటుంటారు. అమ్మాయిలతో రాసలీలలు, పులిహోర కలపడం ఇలా ఎన్ని రకాల కామెంట్స్ చేసినా ఆయన వాటిని చాలా సరదాగా తీసుకుంటుంటారు. నిజానికి సుధీర్ వ్యక్తిత్వం అది కాదు. బయట చాలా హుందాగా ఉంటారు. అంతే కాదు ఆయనకు స్టార్ హీరోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.