Brahmamudi, October 26th Episode: బకరా అయిన రాజ్.. కావ్యని దెబ్బ కొట్టిన అనామిక..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. సుభాష్ దగ్గరకు వెళ్లి గుడ్ మార్నింగ్ డాడ్ అని అంటాడు. గుడ్ మార్నింగ్ రా రాజ్.. నీకో విషయం చెప్పాలి. చెప్తే నువ్వు ఒప్పుకోవేమోరా అని సుభాష్ అంటాడు. పితృ వాక్య పరిపాలన చేయడం పుత్రుల ధర్మం. నాకు అర్థమైంది మీరు ఏం చెప్తారో నాకు అర్థమైంది. నేను ఒప్పుకోనే ఒప్పుకోనని రాజ్ అంటాడు. అదేంట్రా నీ కన్న తండ్రిని.. ఏది ఒప్పుకోవు.. నేనేం అనుకున్నాను రా.. నా కార్ సర్వీస్‌కి వెళ్లింది.. నీ కార్ ఇవ్వమని అడుగుదాం అనుకున్నా అని సుభాష్ అంటే..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. సుభాష్ దగ్గరకు వెళ్లి గుడ్ మార్నింగ్ డాడ్ అని అంటాడు. గుడ్ మార్నింగ్ రా రాజ్.. నీకో విషయం చెప్పాలి. చెప్తే నువ్వు ఒప్పుకోవేమోరా అని సుభాష్ అంటాడు. పితృ వాక్య పరిపాలన చేయడం పుత్రుల ధర్మం. నాకు అర్థమైంది మీరు ఏం చెప్తారో నాకు అర్థమైంది. నేను ఒప్పుకోనే ఒప్పుకోనని రాజ్ అంటాడు. అదేంట్రా నీ కన్న తండ్రిని.. ఏది ఒప్పుకోవు.. నేనేం అనుకున్నాను రా.. నా కార్ సర్వీస్‌కి వెళ్లింది.. నీ కార్ ఇవ్వమని అడుగుదాం అనుకున్నా అని సుభాష్ అంటే.. దానికి వాడిని అడిగేది ఏంటి అన్నయ్యా.. పనీ పాట లేదు కదా అని ప్రకాశం అంటాడు. అవును కదా.. కీస్ నేను తీసుకుంటానులే అని సుభాష్ అంటాడు. ఏమిటోరా నిన్ను చూస్తుంటే కడుపు కంద ముక్కలా తరుక్కు పోతుంది. ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు రా.. అని ఇందిరా దేవి అంటుంది.
రూటు మార్చిన రాజ్..
అప్పుడే అపర్ణ వచ్చి రాజ్‌ని పిలుస్తుంది. మమ్మీ ఖచ్చితంగా దాని గురించే అడుగుతుందని.. మమ్మీ ఏంటి మమ్మీ అని అంటాడు. నీతో ఇదే చిక్కురా.. ఒక పట్టాన ఏదీ ఒప్పుకోవు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాలని అపర్ణ అంటుంది. ముందు విషయం ఏంటో చెప్పు అని రాజ్ అంటాడు. అది ఏంటంటే.. అని అపర్ణ అనబోతే.. రేయ్ ఏంట్రా అక్కడ ఏం జరుగుతుంది? వాడికి ఏం తెలుసు? అని రుద్రాణి అంటుంది. నాకు ముందే తెలుసు మమ్మీ అని రాజ్ అంటే.. నేను కూరగాయలు తీసుకురమ్మని చెప్పడం నీకు ముందే తెలుసా? అని అపర్ణ అంటుంది. ఏంటి నేను కూరగాయలు తీసుకు రావాలా? అని రాజ్ షాక్ అవుతాడు. ఓహో వీళ్లు రూట్ మార్చి.. ఇంట్లో పనులు చెయలేక.. ఆఫీస్‌లో మేనేజర్ కింద చేస్తానని అనుకుంటున్నారా.. చేస్తా.. మారుస్తా మీ ప్లాన్ మారుస్తానని రాజ్ అనుకుంటాడ.
ఆఫీసులో రాజ్, కావ్యల మీద బెట్టింగులు..
సరే మమ్మీ వెళ్తాను.. ఏం కావాలి అని రాజ్ అడిగితే.. అందరూ షాక్ అవుతారు. ఏంటి అంత షాక్ అయ్యారు. ఇంట్లో పని లేకుండా ఉన్నాను కదా.. అందుకే కూరగాయలు తెస్తాను. చెప్పమని రాజ్ అడుగుతాడు. అప్పుడే అపర్ణ, ఇందిరా దేవి కలిపి.. లిస్ట్ చెప్తారు. ఇక కారు తీసుకెళ్దామని రాజ్ అంటే.. కారు ఎక్కడ ఉంది? మీ నాన్న తీసుకెళ్లారు కదా.. నడిచి వెళ్లాలని అపర్ణ అంటుంది. సరే అని బయలు దేరతాడు రాజ్. ఆ తర్వాత అపర్ణ.. కనకానికి ఫోన్ చేసి.. రాజ్ వస్తున్నాడని చెప్తుంది. ఓకే ఇక నా తడాఖా చూపిస్తానని కనకం అంటుంది. మరోవైపు ఆఫీస్‌కి కావ్య మేడమ్ వస్తుందని లేదు రాజ్ సర్ వస్తాడని పందెం కాసుకుంటారు. అప్పుడే కావ్య ఎంట్రీ ఇచ్చి.. ఎందుకు ఆపారు? వేయండి.. మీకు వేలకు వేలు జీతాలు ఇచ్చేది మీకు ఇలా పందాలు వేసుకోవడానికి కాదు. వెళ్లండి వెళ్లి పని చూసుకోమని కావ్య వార్నింగ్ ఇస్తుంది. సరే శ్రుతి నువ్వు వెళ్లి.. క్లయింట్స్ అందరికీ ఫోన్ చేసి.. రమ్మని చెప్పు. నేను మాట్లాడాని కావ్య అంటుంది.
ఆఫీస్‌కి వస్తాడు..
ఆ తర్వాత కావ్య అపర్ణకు ఫోన్ చేస్తుంది. మీ మనవడు ఇంకా ఎందుకు రాలేదని అడుగుతుంది. సడెన్‌గా నువ్వు సిఈవో అనేసరికి వాడికి జీర్ణం కాక.. అజీర్తి చేసిందిలే. త్వరలోనే వచ్చేస్తాడని పెద్దావిడ అంటుంది. నాకు ఎందుకో మీరు తప్పు చేస్తున్నారని అనిపిస్తుందని కావ్య అంటే.. మేము తప్పు చేయడం ఏంటి? అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం. వాడు నిన్ను అపార్థం చేసుకుని చేయని తప్పుకు నిందలు వేస్తే చూస్తూ ఊరుకోవాలా? అయినా ఇప్పుడు నిన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టడానికి కారణం.. అక్కడ ఉన్న సమస్యలు తీర్చుతావని.. అపార్థాలు తొలగిస్తావని అంటారు. మీ మనవడు రాకుండా ఎలా తీరుస్తారని కావ్య అడిగితే.. వస్తాడు.. నువ్వు ముందు ఆఫీస్ పని చేసుకోమని ఇందిరా దేవి అంటే సరే అని అంటుంది కావ్య.
నా కొడుకుని టార్చర్ చేయాలి అత్తయ్యా..
చూశారా అత్తయ్యా నా కోడలు ఎంత పిచ్చిది కాకపోతే.. వాడు ఎంతలా అవమానించినా.. ఇంకా వాడి గురించే ఆలోచిస్తుందని అపర్ణ అంటే.. అందుకే కదా వాడు అంతలా చెలరేగి పోతున్నాడు. లేదు అత్తయ్యా కొడుకు అని జాలి చూపించకుండా.. వాడికి ఇంతకు ఇంత టార్చర్ చేద్దామని అపర్ణ అంటుంది. రాజ్ కూరగాయల షాపుకు వచ్చి.. ఏంటి ఎలా ఉంది బిజినెస్ అని అడుగుతాడు. ఏదో బాబు అలా సాగుతుందని కూరగాయలు అమ్మే అతను అంటాడు. గుమ్మడి కాయ ఎంత? అని రాజ్ అడిగితే.. ఎంత బాబూ 100 రూపాయిలే అని అంటాడు. ఏంటి ఇంత చిన్న యాపిలే 50లు అంటే.. దానికన్నా పది రెట్లు పెద్దగా ఉంది కనీసం 200లు అయినా తీసుకోమని రాజ్ అంటే.. వీడు ఎవడో డబ్బు ఉన్న అమాయకుడిలా ఉన్నాడని అనుకుని.. అంతే బాబు తీసుకోమని అంటాడు కూరగాయలు అమ్మే అతను. పక్క నుంచి కనకం అంతా చూస్తుంది.
రూ.6 వేలు పెట్టి కూరగాయలు కొన్న రాజ్..
ఆ తర్వాత కూరగాయల అన్నీ తీసుకుంటాడు రాజ్. అన్నీ కొన్నాక బిల్ ఎంత అయిందని అంటే.. రూ.6200లు అని చెప్తాడు. అంతేనా తీసుకోమని రాజ్ అంటాడు. రూ.600 బిల్లుకు.. రూ.6000 వస్తున్నాయి. వీడు ఎవడో బకరా దొరికాడు బాగా అని కూరగాయలు అమ్మే అతను సంతోష పడతాడు. అది విని కనకం షాక్ అయి వస్తుంది. ఏరా బిల్లు ఎంత.. ఎగిరి తంతే.. రూ.600 కూడా చేయని కూరగాయలకు అంత బిల్లా.. వీడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు బాబూ అని కనకం అంటుంది. మీరు చేసింది ఏంటి క్యాన్సర్ కనకం గారు.. చివరి ఆఖరి కోరిక అని చెప్పి.. నన్ను మోసం చేశారు కదా అని రాజ్ అంటే.. అవును తప్పు చేశాను. కానీ అందులో నా కూతురికి ఎలాంటి సంబంధం లేదనికనకం చెబితే.. మిమ్మల్ని, మీ కూతుర్ని ఈ జన్మలో నమ్మనని రాజ్ అంటాడు. అప్పుడే కనకం పుట్టుకు జర జర.. డుపిక్ మేమే అని కనకం స్టోరీ చెప్పి.. ఆఫీస్‌కి వెళ్లమని చెబుతుంది. మీరు చెప్పడం వల్ల అస్సలు నేను అక్కడికి వెళ్లను. మీ కూతురు అక్కడే ఉంటే కనీసం కాలు కూడా పెట్టనని రాజ్ అంటాడు. అలా అనకండి బాబూ అని కనకం చెబుతున్నా.. రాజ్ వినిపించుకోకుండా వెళ్తాడు.
కావ్యకు అనామిక వార్నింగ్..
ఆ తర్వాత.. శ్రుతి కావ్య దగ్గరకు వచ్చి.. క్లయింట్స్‌కి మీరు కలవాలి అనుకుంటున్న విషయం చెప్పాను. కానీ వాళ్లు ఎవరూ రావడానికి ఇష్ట పడటం లేదు. మనతో బిజినెస్ చేయడం ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పేశారు మేడమ్ అని శ్రుతి అంటుంది. అదేంటి? అని కావ్య ఆలోచనలో పడుతుంది. అప్పుడే అనామిక ఫోన్ చేస్తుంది. నిన్ను ఓడించడమే నా పని.. కాబట్టి నీ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటానని అనామిక అంటుంది. గెలుపోటములు ఎప్పుడూ ఒకే దగ్గర ఉండవని కావ్య అంటే.. మీ కంపెనీ క్లయింట్స్‌ని నేను లాక్కున్నా.. ఊహల్లోంచి బయటకు రా.. ఆ తర్వాత మీ ఆఫీస్‌లో పని చేసే వాళ్లందర్నీ నా వైపుకు లాక్కుంటానని అనామిక అంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజుఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..