టీవీ సీరియల్స్ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ఆడవాళ్లు సీరియల్స్ చూస్తూ ఉంటారు. టీవీ సీరియల్స్ పుణ్యమా అని ఛానెల్స్ రేటింగ్స్ లో దూసుకుపోతున్నాయి. బార్క్ 2023వ సంవత్సరానికిగానూ 13వ వారం విడుదల చేసిన రేటింగ్స్‌లో ప్రైమ్ టైమ్ తోపాటు నాన్ ప్రైమ్ ట్రైమ్‌లో కూడా ఇతర జీఈసీ ఛానెల్స్ రేటింగ్స్ ని దాటుకుంటూ, అత్యధిక రేటింగ్స్ సాధించింది స్టార్ మా. గ్రాస్ రేటింగ్ పాయిట్స్ విషయంలో తెలుగు ఛానెల్స్ లో మాత్రమే కాదు, దేశం మొత్తం మీద మరే ఇతర భాషలోని వినోద ఛానెల్స్ సాధించలేని అరుదైన రికార్డు ను సాధించింది స్టార్ మా. స్టార్ మాలో రీసెంట్ గా స్టార్ట్ అయిన ‘నాగపంచమి’, ‘బ్రహ్మముడి’ సీరియల్స్ గత రికార్డులన్నింటినీ తిరగరాశాయి. గత మూడేళ్లగా కొనసాగుతున్న రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ ‘నాగపంచమి ’సీరియల్ 11556 జీఆర్‌పీలు, ‘బ్రహ్మముడి’ సీరియల్ 10372.2 జీఆర్‌పీలు సాధించాయి. ఈ రికార్డులకు దూరంగా సన్‌టీవీలో ప్రారంభమైన ‘వనథై పోలా ’9661.2 జీఆర్‌పీలు; స్టార్ ప్లస్‌లో ప్రారంభమైన ‘ఇమ్లీ’ (8814.1), కలర్స్‌లో ‘నాగిన్ 5’ (8700.5) తరువాత స్థానాలలో నిలిచాయి.
ఇదే రీతిలో తెలుగు సినీ అభిమానుల వినోద కేంద్రంగా స్టార్‌మా మూవీస్, జెమినీ టీవీని వెనక్కి నెట్టి 228 జీఆర్‌పీల రేటింగ్ సాధిస్తే, ఇండియాలో నెంబర్1 మ్యూజిక్ ఛానెల్‌గా స్టార్ మా మ్యూజిక్ స్పష్టమైన ఆధిక్యతను ఇతర మ్యూజిక్ ఛానెల్స్‌పై చూపింది. స్టార్ మా మ్యూజిక్ 75900 జీఆర్‌పీలు, ఎంటీవీ బీట్స్ కేవలం 65,213 జీఆర్‌పీలు మాత్రమే సాధించింది.
గత వారం రేటింగ్స్‌లో స్టార్ మా, తమకు పోటీగా చెప్పుకుంటున్న ఛానల్స్‌పై స్పష్టమైన ఆధిపత్యాన్నిచూపింది. మొత్తంమ్మీద 882 జీఆర్‌పీ ల రేటింగ్‌ను సాధించగా, పోటీ ఛానెల్ కేవలం 772 జీఆర్‌పీ లకు మాత్రమే పరిమితం కావాల్సివచ్చింది. స్టార్ మా ప్రైమ్‌టైమ్ జీఆర్‌పీ లలో 342 , నాన్ ప్రైమ్ టైమ్‌లో 510 సాధించింది.