సిరి-శ్రీహన్ మధ్య దూరం పెరిగిందా.? వైరల్ అవుతున్న సిరి ప్రియుడి ఇన్‌స్టా పోస్ట్!

సిరి-శ్రీహన్ మధ్య దూరం పెరిగిందా.? వైరల్ అవుతున్న సిరి ప్రియుడి ఇన్‌స్టా పోస్ట్!
Srihan

. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ రియాల్టీ షో కారణంగా ఇద్దరు కంటెస్టెంట్లు పూర్తి నెగటివిటీని మూతగట్టుకున్నారు..

Ravi Kiran

|

Jan 04, 2022 | 3:31 PM

అనుకున్నట్లే జరిగింది. బిగ్ బాస్ షో రెండు జంటల మధ్య చిచ్చు పెట్టేసింది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ రియాల్టీ షో కారణంగా ఇద్దరు కంటెస్టెంట్లు పూర్తి నెగటివిటీని మూతగట్టుకున్నారు. ఎవరి గురించో ఈపాటికి మీకు అర్ధమై ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న షణ్ముఖ్, సిరిలు.. షో ముగిశాక సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు. హౌస్‌లో వారు చేసిన తప్పులు కారణం ఇప్పుడు వారి లవ్ లైఫ్‌లో అపార్ధాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇప్పటికే దీప్తి సునయన.. షణ్ముఖ్‌తో తన ఐదేళ్ల ప్రేమ బంధానికి ముగింపు పలకగా.. త్వరలోనే శ్రీహన్ కూడా సిరికి బ్రేకప్ చెప్పబోతున్నాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో తాజాగా శ్రీహన్ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. సిరి పుట్టినరోజు సందర్భంగా శ్రీహన్ తన ఇన్‌స్టాలో స్టేటస్ పెట్టాడు. ”హ్యాపీ బర్త్ డే సిరి.. ఈ సంవత్సరం నీ లైఫ్‌లో మరింత పాజిటివిటీని తీసుకురావాలని.. నీ లక్ష్యాలను త్వరలోనే చేరుకుంటావ్. గాడ్ బ్లెస్ యూ” అంటూ పేర్కొన్నాడు. దీప్తి-షణ్ముఖ్ మాదిరిగానే వీళ్ళిద్దరూ కూడా విడిపోతారని ఊహాగానాలు జోరందుకున్న వేళ.. శ్రీహన్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

కాగా, బిగ్ బాస్‌లో ఉన్నంతకాలం సిరికి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు శ్రీహన్. అలాగే సోషల్ మీడియాలో సిరికి నెగిటివిటీ పెరిగినా.. చివరి వరకు తనకే మద్దతుగా నిలిచాడు. ఆమె గెలుపు కోసం చివరి వరకు వెన్నెంటే ఉన్నాడు శ్రీహన్. అయితే బిగ్ బాస్ ముగిశాక సిరి, శ్రీహన్ కలిసి కనబడలేదు. అలాగే శ్రీహన్ చేసిన ఈ పోస్ట్‌కు సిరి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వీరి బ్రేకప్ గుసగుసలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read:

ఈ ఫోటోలో మంచు చిరుతను కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్.! ట్రై చేయండి..

మద్యం తాగిన కోతి.. ఫుల్‌గా కిక్కెక్కి ఏం చేసిందో చూస్తే నవ్వాపుకోలేరు.. వైరల్ వీడియో!

షణ్ముఖ్-దీప్తిల బ్రేకప్ అనంతరం సిరి ఎమోషనల్ పోస్ట్.. నెట్టింట వైరల్.!

అందాల చిరునవ్వుతో కట్టిపడేస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు అబ్బాయిల రాకుమారి!

Siri

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu