Bigg Boss 7 Telugu: సీరియల్ నటి ఇంట విషాదం.. చివరి క్షణంలో బిగ్‎బాస్‏కు గుడ్ బై ?..

ఇప్పటికే బిగ్‎బాస్‏ సీజన్ 7 కంటెస్టెంట్స్ లీస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. హీరోహీరోయిన్స్, సీరియల్ నటీనటులు, మోడల్స్, యూట్యూబర్స్ ఇలా జనాలకు తెలిసిన వారినే ఇంట్లోకి తీసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్ కు తరలించారు. అయితే బిగ్‎బాస్‏ ప్రారంభంలోనే సీరియల్ నటి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దీంతో ఆమె బిగ్‎బాస్‏ కు చివరి క్షణంలో గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది.

Bigg Boss 7 Telugu: సీరియల్ నటి ఇంట విషాదం.. చివరి క్షణంలో బిగ్‎బాస్‏కు గుడ్ బై ?..
Tv Actress Pooja Murthy

Updated on: Sep 02, 2023 | 11:32 AM

మరికొన్ని గంటల్లో బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‎బాస్‏ సీజన్ 7 ప్రారంభం కాబోతుంది. సెప్టెంబర్ 3న అంటే ఆదివారం సాయంత్రం 7 గంటలకు సీజన్ 7 స్టార్ట్ కాబోతుందని గత కొద్ది రోజులుగా అనౌన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే బిగ్‎బాస్‏ సీజన్ 7 కంటెస్టెంట్స్ లీస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. హీరోహీరోయిన్స్, సీరియల్ నటీనటులు, మోడల్స్, యూట్యూబర్స్ ఇలా జనాలకు తెలిసిన వారినే ఇంట్లోకి తీసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్ కు తరలించారు. అయితే బిగ్‎బాస్‏ ప్రారంభంలోనే సీరియల్ నటి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. దీంతో ఆమె బిగ్‎బాస్‏ కు చివరి క్షణంలో గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆమెనే పూజా మూర్తి. గుండమ్మ కథ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది పూజా మూర్తి.

ఈ సీరియల్ ద్వారా తెలుగులో పాపులారిటీని సొంతం చేసుకున్న పూజా ఈసారి సీజన్ 7లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతుంది. అంతేకాదు.. ఇంట్లోకి అడుగు పెట్టబోయే మొదటి కంటెస్టెంట్ కూడా ఈమె కావడం విశేషం. ఇప్పటికే ఆమె ప్రోమో షూట్ కంప్లీట్ అయ్యిందని టాక్. బిగ్‎బాస్‏ హౌస్ లోకి అడుగుపెట్టడానికి అన్ని పనులు పూర్తిచేసుకున్న పూజా మూర్తి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి మరణించడానే వార్త తెలియడంతో నేరుగా బిగ్‎బాస్‏ సెట్స్ నుంచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. పూజా తన తండ్రి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతుంది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో తన తండ్రిని తలుచుకుంటూ భావోద్వేగానికి గురయ్యింది. “RIP.. రిటర్న్ ఇఫ్ పాజిబుల్.. నిన్ను ఎంతగానో ప్రేమించాను నాన్నా.. ప్రతిక్షణం మిమ్మల్ని మిస్ అవుతూనే ఉన్నాను.. మిమ్మల్ని గర్వపడేలా చేశానని భావిస్తున్నాను. తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేస్తే నన్ను క్షమించండి. మీరు నాతోనే ఎప్పటికీ ఉంటావని నాకు తెలుసు. మీ ఆశీర్వాదాలు నాకు, అమ్మకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను” అంటూ ఇన్ స్టా స్టోరీలో తండ్రితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి మరణంతో పూజా మూర్తి బిగ్‎బాస్‏ సీజన్ 7 వదలుకున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.