
రిషబ్ శెట్టి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తన పుట్టినరోజున కాంతారా 2 అప్‌డేట్‌ను పంచుకుంటాడని అభిమానులు ఆశించారు కానీ అదేమీ జరగలేదు. అయితే కానీ తన పుట్టినరోజు ముగింపు వేడుకల్లో రిషబ్ శెట్టి ఎట్టకేలకు కాంతారా 2 చిత్రం గురించి మాట్లాడాడు . సినిమా ఏ దశలో ఉంది? చిత్రీకరణ ఎప్పుడు? సినిమాపై వస్తున్న వార్తల్లో ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పాడు. ‘కాంతారా 2 పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.. ఇక నుంచి లొకేషన్ సెర్చ్, ఆర్టిస్ట్ ఎంపిక జరుగుతుంది. ఆ తర్వాత సినిమా షూటింగ్ గురించి హోంబాలే ఫిలింస్ అధికారికంగా ప్రకటిస్తుంది. కాంతారా 2 చిత్రాన్ని ఈ ఏడాదే ప్రకటించి, చిత్రీకరించి 2024లో విడుదల చేస్తాం’ అని రిషబ్ తెలిపారు. అదే సమయంలో కాంతార సీక్వెల్‌పై వస్తోన్న పుకార్లను నమ్మవద్దని సూచించారు. ఇక పుట్టిన రోజు వేడుకల గురించి మాట్లాడుతూ.. ‘నేను పట్టణంలో ఉన్నప్పుడు, పుట్టినరోజు వేడుకల ఆలోచన లేదు. కాలేజీకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా బెంగళూరు వచ్చిన తర్వాత ఇలా పుట్టినరోజులు జరుపుకుంటున్నాను. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా నా పుట్టినరోజున పని చేయాలనే ఆలోచన వచ్చింది. అయితే ఈసారి అభిమానులను కలవాలనుకున్నాను. అలాగే, స్నేహితులు, కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఈ వేడుకలు జరుగుతున్నాయి’ అని రిషబ్ చెప్పుకొచ్చారు.
‘కాంతారావు తర్వాత ఇంటికి చాలా మంది వచ్చారు, ఇతర కార్యక్రమాలకు వెళ్లినప్పుడు కలిసేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఆ తర్వాత చాలా మంది మెసేజ్‌లు పెట్టారు. అలాగే కాంతారా తర్వాత ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలు చెప్పాలి, ఇంతకంటే మంచి ప్లాట్‌ఫాం దొరకదు అనుకున్నాం. అందుకే పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నా’ అని రిషబ్ చెప్పుకొచ్చాడు. కాంతారా సినిమా తర్వాత రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కర్ణాటకలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.