బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న బిగ్‌బాస్ సీజన్ 5 తుది అంకానికి చేరుకుంది. ఇక మరో ఐదు రోజుల్లో ఈ గేమ్‌షోకు శుభం కార్డు పడనుంది. బిగ్‌బాస్ చరిత్రలోనే మొదటిసారిగా19 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ టీవీషోలో ఇప్పుడు ఐదుగరు మాత్రమే నిలిచారు. సన్నీ, మానస్, శ్రీరామ్, షణ్ముఖ్, సిరి టైటిల్ బరిలో నిలిచారు. గతంలో కంటే ఈసారి గ్రాండ్ ఫినాలేను మరింత ఘనంగా బిగ్‌బాస్ షో యాజమాన్యం ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. పలు టాలీవుడ్ స్టార్లతో పాటు బాలీవుడ్ స్టార్లను ఈ షోలో సందడి చేయనున్నారని సమాచారం. మరోవైపు తమ అభిమాన కంటెస్టెంట్‌ను గెలిపించుకునేందుకు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఇప్పటికే ఓటింగ్ ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశారు. కాగా గత సీజన్లలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బిగ్‌బాస్ విజేతలు ట్రోఫీ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈసారి బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు చిరు తనయుడు మెగా పవర్‌స్టార్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు సమాచారం. అతనితో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు బిగ్‌బాస్ వేదికపై సందడి చేయనున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఇప్పటికే రామ్ చరణ్.. బిగ్‌బాస్ షోకు హాజరైన సంగతి తెలిసిందే.
అతనికే ఛాన్స్!
అయితే ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో మంచి ఎంటర్‌టైనర్ సన్నీనే అని చెప్పుకోవచ్చు. అప్పుడప్పుడూ కోపతాపాలు ప్రదర్శించినా అందరినీ సరదాగా నవ్విస్తూ బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలిచాడు. తోటి సభ్యులందరూ నామినేట్ చేసినా నవ్వుతూ స్వీకరించాడు. సిరి, షణ్ముఖ్‌లతో గొడవలు పడినా ఆ సందర్భానికే వాటిని పరిమితం చేసి ప్రేక్షకుల మనసులను గెల్చుకున్నాడు. అందుకే చాలా సార్లు నామినేట్ అవుతున్నా ఫ్యాన్స్ తమ ఓటింగ్‌తో అతనిని కాపాడుతూ వస్తున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లోనూ బిగ్‌బాస్ సన్నీపై ప్రశంసలు కురిపించడం విశేషం. సరదా.. సన్నీ రెండూ ఒకే అక్షరంతో మొదలవుతాయన్నారు. ‘హౌస్‌లో తోటి కంటెస్టెంట్లతో గొడవలు, ఒడిదొడుకులు ఎదురైనా అందరి ముఖాల్లో నవ్వు తీసుకొచ్చేందుకు ప్రయత్నించావు. బెస్ట్ ఎంటర్ టైనర్‌గా ప్రేక్షకుల మదిలో మంచి స్థానం సంపాదించావు. ఒంటరి మనిషికి కొంచెం ప్రేమను సంపాదించుకోవడం కన్నా పెద్ద విజయమేమీ లేదని నీ వండర్‌ఫుల్ జర్నీతో నిరూపించావు. అప్నా టైం ఆయేగా.. సన్నీ’ ఓ రేంజ్‌లో బిగ్‌బాస్ సన్నీని పొగిడేశాడు. ఇక సోషల్ మీడియాలో కూడా అతనే బిగ్‌బాస్ విన్నర్‌గా నిలుస్తాడని ఫ్యాన్స్ పోస్టులు షేర్ చేస్తున్నారు. సన్నీకే ఓటేయాలంటూ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఈసారి బిగ్‌బాస్ ట్రోఫీని ఎవరు చేజిక్కించుకుంటారో!
High Chances of Winning the Trophy for #VJSunny ?@AlwaysRamCharan as Chief guest for #BiggBossTelugu5
All the best #Sunny ? pic.twitter.com/HFgiSsK3JN
— Thyview (@Thyvieew) December 14, 2021