సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో.. టీవీ సీరియల్స్ కు కూడా అంతే కేజ్ ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్లకు మంచి టైం పాస్ అయ్యేది ఈ సీరియల్స్ తోనే.. ఒక్క సీరియల్ కూడా మిస్ అవ్వకుండా అన్ని సీరియల్స్ ను చేసేస్తుంటారు మహిళామణులు. ఇదిలా ఉంటే కరోనా పుణ్యమా అని లాక్ డౌన్ సమయంలో మగవాళ్ళు కూడా సీరియల్స్ కు అలవాటు పడిపోయారు. ఇక ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి చాలా రకాల సీరియల్స్ వస్తున్నాయి. తాజాగా మహిళల కోసం మరో రెండు కొత్త సీరియల్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
జెమినీ టీవీ లో సరికొత్త సీరియల్స్ రాధ, మూడు ముళ్ళు . ఈ రెండు సీరియల్స్ త్వరలోనే టెలికాస్ట్ కానున్నాయి. రాధ సీరియల్ విషయానికొస్తే.. అమ్మ చేతి ముద్ద , చందమామ రావే జాబిల్లి రావే , ఇవేగా మనకి అమ్మ ని జ్ఞాపకం తెచ్చే మధుర స్మృతులు . కానీ అలాంటి జ్ఞాపకాలు ఏమీ లేకుండా ఉంది ఖుషి. అమ్మ ని పొందాలని ఆరాటపడే ఖుషికి మన రాధ ఎదురుపడింది . అమ్మని తలపించింది . దాంతో ఖుషి రాధే తనకి అమ్మలా రావాలని పట్టు పట్టింది . మరి రాధ ఖుషి కి అమ్మ కాగలిగిందా రాధ ఎన్ని ఒడిదుడుకులని ఎదుర్కొంది ఎలా దైవం తనకి ఇచ్చిన బాధ్యతని నిర్వర్తించింది ? ఎలా తన జీవితాన్ని సాగించింది చూడాలంటే ? జెమినీ టీవీ లో సరికొత్త డైలీ సీరియల్ రాధ చూడాల్సిందే. ఈ నెల 30 నుండి ప్రారంభం .సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8:30 గంటలకు టెలికాస్ట్ కానుంది.
మూడు ముళ్ళు సీరియల్ విషయానికొస్తే.. నీలవేణి- పల్లెపాలెం అనే ఒక చిన్న గ్రామంలో తన ఇద్దరు చెల్లెళ్లే తన ప్రపంచంగా బతుకుతుంటుంది. మూడు ముళ్ళు వేసేవాడు తన జీవితంలోకి వస్తే తన చెల్లెళ్ల జీవితాలు ఏమైపోతాయో అనుకుని పెళ్లే వద్దనుకుంటుంది. అలాంటి నేలవేణి జీవితంలోకి తన ప్రమేయమే లేకుండా ఓ వ్యక్తి ప్రవేశించి తన మెడలో మూడు ముళ్ళు వేస్తే ? తనది కాని ప్రపంచంలోకి ఏడు అడుగులు వేసిన నీలవేణికి అడుగడుగునా సమస్యల అగాధాలు ఎదురైతే,వాటిని ఆమె ఎలా ఎదుర్కొంది.? తెలియాలంటే జెమినీ టీవీ లో మూడు ముళ్ళు సీరియల్ చూడాల్సిందే. ఈ నెల 30 నుండి ప్రారంభం.. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 09:00 గంటలకు ఈ సీరియల్ టెలికాస్ట్ కానుంది.