Radhe Shyam: ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాకోసం అభిమానులంతా ఏంటో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ చేస్తారా అన్న ఆత్రుతతో ఉన్నారు ఫ్యాన్స్. పిరియాడికల్ లవ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఎలాంటి మేజర్ అప్డేట్ లేదని అభిమానులంతా కాస్త నిరాశతో ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ నిర్మాతలను చిత్రయూనిట్ పై ప్రశ్నలు వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఇక షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో కొన్ని సీన్స్ విషయంలో ప్రభాస్ అసంతృప్తి వ్యక్తం చేసారని దాంతో రీషూట్ ప్లాన్ చేసుకున్నారని తెలుస్తుంది. మరో సింగిల్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఈ నెల 23వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకూ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. దాంతో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందట.
ఇదిలా ఉంటే పునర్జన్మలతో ముడిపడిన ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కుతోందని అంటున్నారు.. దాదాపుగా విదేశాల్లోనే ఈ కథ నడుస్తుందట. ఈ సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ నటిస్తున్నారు. మరో కీలక పాత్రను కృష్ణంరాజు పోషిస్తున్నారని తెలుస్తుంది. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :