Bigg Boss 8 Telugu: సడెన్‏గా ఆ సీరియల్‏కు శుభం కార్డ్.. బిగ్‏బాస్ షో కారణమా.. ?

|

Aug 25, 2024 | 2:46 PM

సీరియల్ నటీనటులు, యాంకర్స్, నెట్టింట ఫేమస్ అయిన వారి పేర్లు ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి. కానీ ఎవరు ఫైనల్ అయ్యారనే విషయం మాత్రం తెలియరాలేదు. ఈ క్రమంలో తాజాగా కొన్ని సీరియల్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే సూపర్ హిట్ గా దూసుకుపోతున్న గుప్పెడంత మనసు సీరియల్ త్వరలోనే ముగుస్తుందంటూ డైరెక్టర్స్ తెలిపారు.

Bigg Boss 8 Telugu: సడెన్‏గా ఆ సీరియల్‏కు శుభం కార్డ్.. బిగ్‏బాస్ షో కారణమా.. ?
Oorvasivo Rakshasivo
Follow us on

బుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీ షో షూరు కానుంది. ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు ఈ షో ప్రారంభంకానున్నట్లు ఇదివరకే నిర్వాహకులు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇందుకు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. కానీ ఇప్పటివరకు కంటెస్టెంట్స్ ఫైనల్ కాకపోవడం గమనార్హం. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. సీరియల్ నటీనటులు, యాంకర్స్, నెట్టింట ఫేమస్ అయిన వారి పేర్లు ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి. కానీ ఎవరు ఫైనల్ అయ్యారనే విషయం మాత్రం తెలియరాలేదు. ఈ క్రమంలో తాజాగా కొన్ని సీరియల్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే సూపర్ హిట్ గా దూసుకుపోతున్న గుప్పెడంత మనసు సీరియల్ త్వరలోనే ముగుస్తుందంటూ డైరెక్టర్స్ తెలిపారు. చాలా రోజుల క్రితమే ఈ సీరియల్ క్లైమాక్స్ షూటింగ్ కూడా పూర్తైంది. తాజాగా ఈ సీరియల్ బాటలోనే మరో సీరియల్ కు కూడా ఎండ్ కార్డ్ వేయనుంది.

అదే ఊర్వశివో రాక్షసివో సీరియల్. తొందర్లోనే ఈ ధారవాహిక కూడా ముగియబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. గతేడాది డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ సీరియల్ కేవలం ఎనిమిది నెలల్లోనే ముగిస్తున్నారని సమాచారం. బిగ్‏బాస్ షో కారణంగానే ఈ సీరియల్ ను ఉన్నట్లుండి శుభం కార్డ్ వేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ సీరియల్ టెలికాస్ట్ టైమ్ ను ఇప్పుడు బిగ్‏బాస్ షోకు కేటాయించనున్నారు. అందుకే ఈ సీరియల్ ను ముగిస్తున్నారని టాక్. అంతేకాకుండా ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్న నిఖిల్ కూడా ఈసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్.

గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నిఖిల్. ఆ తర్వాత పలు సీరియల్స్ చేసిన నిఖిల్.. ఇప్పుడు ఊర్వశివో రాక్షసివో సీరియల్లో నటిస్తున్నాడు. ఇందులో విజయేంద్ర పాత్రలో ఫుల్ మార్క్స్ కొట్టేశాడు. ప్రస్తుతం తెలుగు ఫ్యామిలీ అడియన్స్ కు దగ్గరైన నిఖిల్.. ఇప్పుడు బిగ్‏బాస్ రియాల్టీ షోలో పాల్గొననున్నాడని.. అతడి పేరు నెట్టింట మారుమోగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.